Ads
మన పెద్దలు ఏం చెప్పినా దాని వెనుక ఒక శాస్త్రము, సుదీర్ఘమైన వివరణ ఉంటుంది. అయితే మనమే చాదస్తం కానీ కొట్టి పారేస్తాం చాలామంది పెద్దవాళ్లు కాళ్లు ఊపొద్దు అంటే చాదస్తం అని కొట్టి పారేస్తాము కానీ అలా ఊపడం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో తెలిస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే. మీరు గమనించే ఉంటారు కొంతమంది కూర్చున్నప్పుడు తమ రెండు కాళ్ళను అదే పనిగా ఊపుతూ ఉంటారు. మరి కొంతమంది వేగంగా పెద్దగా ఊపుతూ ఉంటారు. చూడ్డానికి ఏదో సంతోషంలో ఊపుతున్నట్లు కనిపిస్తూ ఉంటుంది కానీ నిజానికి దాని వెనకాతల చాలా బలమైన కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా యువతలో ఈ లక్ష్యాలను ఎక్కువగా కనిపిస్తున్నట్లయితే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని అర్థం.
ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్నప్పుడు, పుస్తకం చదువుతున్నప్పుడు ఇలా ఏ పని చేస్తున్నా కూడా ఒకవైపు కాళ్లు ఊపుతూనే ఉంటారు. మన శరీరంలో షుగర్ లెవెల్స్ తగ్గినప్పుడు ఈ అలవాటు మొదలవుతుంది అందువల్లే కొంతమంది కూర్చున్నప్పుడు కాళ్లు కదుపుతూ ఉంటారు. అలాగే సరిపడా నిద్ర లేనప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది. శరీరంలో హార్మోన్స్ తగిన బ్యాలెన్స్ లో లేనప్పుడు కూడా ఈ సమస్య మొదలవుతుంది.
Ads
నిజానికి దీనిని రెస్ట్ లెస్ లెగ్ సిండ్రోమ్ అని అంటారు. ఇది వాళ్ళ సంతృప్తి కోసం కదుపుతున్నట్లుగా ఉంటుంది కానీ దాని వెనుక మధుమేహం, పోషకాహార లోపం, టెన్షన్, నిద్రలేమి వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. అలాగే కొన్ని రకాల డ్రింక్స్, కొన్ని రకాలు మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా కాళ్లు కదుపుతూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని జబ్బులతో బాధపడేవారు ఇందులో భాగంగా ఎప్పుడు కాలు ఊపుతూ ఉంటారు అని సూచిస్తున్నారు.
ఇతర కారణాలు ఉన్నాయో లేదో మనం గుర్తించలేకపోతే నడవడం లేదా నిలబడటంలో ఇబ్బంది, మూత్రం కంట్రోల్ చేసుకోవడంలో ఇబ్బంది, ఆ సంకల్పిత మూత్ర విసర్జన, ప్రేగు కదలిక కోసం వేచి ఉండలేకపోవడం మెదడు పనితీరులో మార్పులు, అస్పష్టమైన దృష్టి అనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలంటూ సలహా ఇస్తున్నారు వైద్య నిపుణులు.