అజిత్ చేతిలో ఉన్న పాప ఆ చిన్నారా..? ఇంతలా మారిపోయిందేంటి?

Ads

ఒకప్పుడు బాల తారలుగా నటించిన చాలామంది చిన్నారులు ఇప్పుడు వెండితెరపై తమ టాలెంటును చూపిస్తూ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణగా నిన్నటి హనుమాన్ మూవీ హీరో తేజ సజ్జ పెద్ద ఉదాహరణ. అలాగే సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిద్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్ ఇలా చాలామంది బాల నటులు ఇప్పుడు తమ నటనతో మనల్ని అలరిస్తున్న వారే. ఇప్పుడు తాజాగా మరొక బాల నటి ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ కి పోటీగా నిలబడేంత అందంగా తయారయ్యే ప్రేక్షకుల మతి పోగుడుతుంది.

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించిందిఈ చిన్నారి. అల్లరి చిన్నారిగా అమాయకపు మాటలు, అల్లరి చేష్టలతో ప్రేక్షకులకు దగ్గరయింది ఇప్పుడు హీరోయిన్ పై సందడి చేసేందుకు రెడీ అయింది. తనే యువీనా పార్ధవి. ఈ పేరుతో చెప్తే గుర్తుపట్టడం కష్టమే కానీ అజిత్ సినిమా చిన్నారి అంటే మాత్రం అందరికీ గుర్తొస్తుంది. 2013లో విడుదలైన ఇవాన్ ఏ కమల్ చిత్రంతో తమిళ చిత్ర సీమలో బాల తారగా అడుగుపెట్టింది.

View this post on Instagram

A post shared by Yuvina Parthavi (@yuvinaparthavi)

Ads

తర్వాత మంజా భైమా ప్యాలెస్, కత్తి వంటి చిత్రాల్లో నటించింది. అలాగే మరొక సినిమాలో సూర్య కూతురుగా నటించి అందరి ప్రశంసలు పొందింది. ఇక అజిత్ సినిమా వీరమ్ లో నటించి అందరి ప్రశంసలు పొందింది యూవీనా. ఈ సినిమాలో అజిత్ కి యువీనా కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈమె తెలుగు, తమిళం, కన్నడం భాషల్లో కూడా అనేక సినిమాలో నటించింది.

అయితే తాజాగా ఈమె కొత్త దర్శకుడు ఆంథోనీ భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన సైరన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాలో జయం రవి, కీర్తి సురేష్ తదితరులు నటించారు. అయితే బాల నటి నుంచి టీనేజ్ లోకి మారిన యువీనా ఫొటోస్ చూసి ఇప్పుడు నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇంత అందంగా తయారైందేంటి హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది అని అభిప్రాయపడుతున్నారు.

Previous article82 ఏళ్ల వయసులో జిమ్‏లో సుమ తల్లి వర్కౌట్స్… యాంకర్ సుమ రియాక్షన్ ఇదే.!
Next articleకూర్చున్నప్పుడు అదేపనిగా కాళ్లు ఊపుతున్నారా..? అయితే జాగ్రత్త! ఆ వ్యాధుల లక్షణాలు కావచ్చు.!
Mounikasingaluri is a Content Writer who Works at the Prathidvani Website. She has 2+ years of experience, and she has also worked at various Telugu news websites. She Publishes Latest Telugu Updates and Breaking News in Telugu, Movies Updates and Other Viral News.