‘వార్ 2’ లో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న హీరోయిన్‌ ఎవరు..? ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏమిటో తెలుసా..?

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో ‘వార్ 2’ మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ మూవీలో నటించబోతున్నారు. ఈ మూవీలో తారక్ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా ఆతృతగా వెయిట్ చూస్తున్నారు.

రీసెంట్ గా రిలీజ్ అయిన ‘టైగర్ 3’ క్లైమాక్స్ లో ఈ క్యారెక్టర్ గురించి హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో నెగటివ్ టచ్ ఉన్నా, హృతిక్ కి సమాన హీరోగా డిజైన్ చేసినట్టు టాక్. తాజాగా ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న భారీ మల్టీ స్టారర్ సినిమా ‘వార్ 2’ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శార్వరి వాఘ్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. శార్వరి 2021 లో ‘బంటీ ఔర్ బబ్లీ 2’ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే ‘స్టార్ డెబ్యూ అఫ్ ది ఇయర్’ ఐఫా అవార్డును,  ఫిలిం ఫేర్ అవార్డ్ ను అందుకుంది.
శార్వరి వాఘ్ 2015లో లవ్ రంజన్ ప్యార్ కా పంచనామా 2 కు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తరువాత బాజీరావ్ మస్తానీ, సోను కే టిటు కి స్వీటీ లాంటి సినిమాలకు  అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించింది. ఆమె 2020 లో కబీర్ ఖాన్ వెబ్ సిరీస్ ‘ది ఫర్గాటెన్ ఆర్మీ – ఆజాదీ కే లియే’ లో తొలిసారిగా నటించింది. ఆ తరువాత బంటీ ఔర్ బబ్లీ 2 లో సైఫ్ అలీ ఖాన్, రాణి ముఖర్జీ, సిద్ధాంత్ చతుర్వేదిలతో కలిసి నటించింది. ఆమె నటనకు గాను విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆమె నటించిన ‘మహారాజా’ షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో సినిమా ‘వేదా’ షూటింగ్ జరుగుతోంది.
ఆఫర్స్ వస్తున్నా శార్వరి ఆచ్చి తుచి ఎంచుకుంటోంది. వార్ 2లో అవకాశం వచ్చినట్టు తెలుస్తోంది. మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. 1996లో మరాఠీ ఫ్యామిలిలో శార్వరి వాఘ్ జన్మించింది. తండ్రి పేరు శైలేష్ వాఘ్ బిల్డర్, తల్లి పేరు నమ్రతా వాగ్, ఆమె ఆర్కిటెక్ట్ గా పనిచేస్తోంది. ఆమె ముంబైలోని దాదర్ పార్సీ యూత్స్ అసెంబ్లీ హైస్కూల్ మరియు రూపారెల్ కాలేజీలో చదువుకుంది. నమ్రతా వాగ్ తండ్రి, శార్వరి తాతయ్య మనోహర్ జోషి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి. ఆమె ఫ్యామిలీ నేపథ్యం తెలిసినవారు షాక్ అవుతున్నారు.

Also Read: ఈ 7 మంది డైరెక్టర్లకి ఈ 7 మంది హీరోయిన్లు చాలా ఫేవరెట్…వారి కాంబినేషన్ లో అన్ని హిట్లే.!

Previous articleహార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ వెనుక ముఖేష్ అంబానీ ఉన్నారా..?
Next articleడంకీ స్టోరీ లీక్..! సలార్ కంటే ఇదే బాగుందిగా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.