శివ శంకర్ మాస్టర్ నగలు ధరించడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?

Ads

శివ శంకర్ మాస్టర్ అందరికి సూపరిచితమే. తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో టాప్ కొరియోగ్రాఫర్ గా రాణించినవారిలో శివ శంకర్ మాస్టర్ కూడా ఒకరు. ఆయన కెరీర్ లో ఎనిమిది వందలకు పైగా సాంగ్స్ కి కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆయన చేసిన పాటలలో హిట్ అయినవే ఎక్కువగా ఉంటాయి.

Ads

ఆ పాటలన్నీ కూడా శివ శంకర్ మాస్టర్ కి మంచి గుర్తింపును తెచ్చాయి. ఆయన తెలుగు, తమిళంలోనే కాకుండా 10కి పైగా భాషల్లో పనిచేశారు. శివ శంకర్ మాస్టర్ కున్న ప్రతిభ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. శివశంకర్ మాస్టర్ ముఖ్యంగా చాలా రియాల్టీ షోలకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. అంతేకాకుండా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగాను, హాస్యనటుడిగానూ కొనసాగారు.
తన కెరీర్ లో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను పొందిన శివ శంకర్ మాస్టర్ 2021 లో కరోనా బారిన పడి, చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులను కలవరపరిచింది. డెబ్బై నాలుగు ఏళ్ళ వయసులో శివ శంకర్ మాస్టర్ చనిపోవడం ఎవరు కూడా జీర్ణించుకోలేకపోయారు. ఇదిలా ఉండగా శివ శంకర్ మాస్టర్ మెడలో ఆడవారి నగలు ధరించడం గురించి వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షికారు చేస్తూ ఉంటాయి. అయితే ఈ విషయం గురించి చాలా ఏళ్ల క్రితం శివశంకర్ మాస్టర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను ఆడవారి నగలు వేసుకోవడం వెనుక ఉన్న కారణాన్ని ఇలా చెప్పుకొచ్చారు. అప్పుటి తరానికి,ఇప్పటి తరానికి చాలా తేడా ఉందని, అప్పుడు చేసే పనికే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారు. కానీ ఇప్పుడు లైట్ యాక్టింగ్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. అమ్మాయిల అందంగా తయారు అయినట్టుగా, మగవాళ్ళు ఎందుకు అందంగా తయారు కాకూడదని అనుకుంటానని,అందుకే నగలు ధరిస్తానని ఆయన తెలిపారు. క్లాసికల్ డాన్స్ నేర్చుకున్న నేను డాన్స్ మాస్టర్ గా ఇలా తయారు అయితే పద్ధతిగా ఉంటానని భావించాను. అందువల్ల ఆడవారు వేసుకునే నగలను ధరిస్తున్నాను అని శివ శంకర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
Also Read: సీనియర్ హీరో శోభ‌న్ బాబు తన కొడుకును హీరోగా చేయ‌లేదు.. ఎందుకంటే?

Previous articleనిజ జీవిత సంఘటన ఆధారంగా కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’ సినిమాని తెరకెక్కించారా?
Next articleబాలయ్య ‘బాలగోపాలుడు’ చిత్రంలో నటించిన ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.