బాలయ్య ‘బాలగోపాలుడు’ చిత్రంలో నటించిన ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా?

Ads

సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారు ఆ తరువాత కాలంలో హీరోలు హీరోయిన్లుగా మారినవారు చాలామంది ఉన్నారు. వారిలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా, హీరోయిన్స్ గా ప్రస్తుతం కొనసాగుతున్న వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు. ఆ జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, హీరోయిన్స్ రాశి, మీనా, హన్సిక లాంటి స్టార్స్ ఉన్నారు.

అయితే హరికృష్ణ పెద్ద కుమారుడు కళ్యాణ్ రామ్ కూడా బాలనటుడిగా నటించి, అలరించాడన్న సంగతి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. మరి కళ్యాణ్ రామ్ బాలనటుడిగా నటించిన ఆ సినిమా బాల గోపాలుడు. ఈ సినిమా 1989లో విడుదల అయ్యింది. ప్రముఖ డైరెక్టర్ కోడి రామకృష్ణ తెరకెక్కించిన ఈ సినిమాలో నందమూరి నటసింహం బాలకృష్ణ, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించారు. కళ్యాణ రామ్ తొలిసారిగా ఈ సినిమా ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు.
ఈ చిత్రంలో బాలకృష్ణతో పాటుగా ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు. వారిలో ఒకరు రాశి కాగా, ఇంకొకరు కళ్యాణ్ రామ్. చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వీరిద్దరి నటన ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా కమర్షియల్ గా విజయం సాధించింది. తరువాత పదేళ్ళకు బాలనటిగా అలరించిన రాశి, కృష్ణబాబు సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ గా చేసింది.

Ads

ఈ సినిమాకు ముత్యాల సుబ్బయ్య డైరెక్టర్. పది సంవత్సరాలకు ముందు బాలకృష్ణకు కూతురిగా చేసిన రాశి, ఆ తరువాత ఆయన సరసన హీరోయిన్ గా నటించే స్థాయికి ఎదిగింది. ఇక కళ్యాణ్ రామ్ ఇండస్ట్రీలో హీరోగా నిర్మాతగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నారు.
Also Read: “అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?

Previous articleశివ శంకర్ మాస్టర్ నగలు ధరించడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో తెలుసా?
Next articleఒక‌ప్పుడు క్రేజీ హీరో ‘వడ్డే నవీన్’ ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఎలా ఉన్నారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.