SHIVA VEDHA REVIEW : ”శివ వేద” సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్…!

Ads

సినిమా: శివ వేద
నటీనటులు : డాక్టర్ శివరాజ్‌కుమార్, గానవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్.
దర్శకత్వం : ఎ. హర్ష
నిర్మాత : గీతా శివరాజ్‌కుమార్, జీ స్టూడియోస్
సంగీతం : అర్జున్ జన్య
విడుదల తేదీ : ఫిబ్రవరి 9, 2023

స్టోరీ :

ఓ ఊరి లో ఉంటున్న వేద (శివరాజ్‌కుమార్) తన కూతురి కనక (అదితి సాగర్) తో హత్యలు చేస్తుండే వాడు. అయితే వీళ్ళ కుటుంబానికి కొందరు ఇబ్బందులు కలిగించేవాళ్ళు. వాళ్ళని చంపేందుకు ఓ చోటు నుండి ఇంకో దగ్గరకి మారుతూ వుంటారు వీళ్ళు. ఒక ఊళ్ళో రౌడీని చంపేయాలని వీళ్ళు అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది…? ఎందుకు వీళ్ళు హత్యలు చేస్తున్నారు..? అసలు వీళ్ళు ఎవరు..? అనుకున్నది చేస్తారా..? ఇవన్నీ సినిమాలో చూడండి.

రివ్యూ :

Ads

ఈ సినిమా కన్నడ సినిమా. తెలుగు లోకి దీన్ని డబ్ చేసి రిలీజ్ చేసారు. ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఈ సినిమా అంతా ఉంటుంది. స్త్రీలపై జరిగే అన్యాయాలని, స్త్రీల సమస్యలని ఇందులో అద్భుతంగా చూపారు. ఇటువంటివి తప్పక తీసుకు రావాలి. శివరాజ్‌కుమార్ ఇలాంటి స్టోరీ ని ఎంపిక చేసుకోవడాన్ని మనం మెచ్చుకోవాలి. కన్నడ నేటివిటీకి తగ్గట్టు ఈ సినిమా వుంది.

సో కొన్ని సీన్స్ ప్రేక్షకులకి ఎక్కకపోవచ్చు. అర్జున్ జన్య ఈ మూవీ కి ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. అలానే గానవి లక్ష్మణ్ పుష్పగా ఎంతో అద్భుతంగా నటించింది. పైగా హీరోతో సమానంగా ఫైటింగ్స్ చేసింది కూడా. అదితి కూడా బాగా నటించారు. క్లైమాక్స్ లో ఆమె యాక్టింగ్ బాగుంది.

ప్లస్ పాయింట్స్:

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
నటీ నటులు
యాక్షన్ సీన్లు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

స్టోరీ రొటీన్ గా ఉంటుంది
కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా ఉంటాయి
సాంగ్స్

రేటింగ్ :

2.75/5

 

 

 

Previous article“అమిగోస్” మూవీ రివ్యూ.. కళ్యాణ్ రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్టేనా?
Next articleటెస్ట్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు ఏం తింటారు..? లంచ్, టీ టైం లో ఏం పెడతారు..?