రజనీకాంత్ శివాజీ సినిమాలోని అక్కమ్మ, జక్కమ్మలు బయట ఎలా ఉంటారో తెలుసా?

Ads

సూపర్ స్టార్ రజనీకాంత్ కున్న క్రేజ్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన కెరీర్ లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే ఉన్నాయి. వాటిలో శివాజీ మూవీ కూడా ఒకటి. ఈ మూవీ టీవిలో వస్తే ఇప్పటికి చూసే ఆడియెన్స్ చాలా మంది ఉంటారు.

Ads

ప్రముఖ దర్శకుడు శంకర్ శివాజీ సినిమాని తెరకెక్కించారు. ఈ మూవీ అన్ని భాషలలో సూపర్ హిట్ అయ్యి, దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లను రాబట్టింది. బ్లాక్ మనీ స్టోరీ నేపద్యంగా వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్, ఆయన స్టైల్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా అన్ని అద్భుతంగా ఉంటాయి. ఈ సినిమాలో రజనీకాంత్ సరసన హీరోయిన్ శ్రీయ నటించింది.ఇంకా ఈ సినిమాలో ఆడియెన్స్ బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా అంటే అది అక్కమ్మ, జక్కమ్మ అనే అక్కాచెల్లెల పాత్రలు అని చెప్పవచ్చు.ఇక ఈ సినిమాలో రజనీకాంత్ శ్రీయను ప్రేమించగా, హీరోయిన్ కుటుంబసభ్యులు కాదని అంటారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా రజనీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి శ్రీయ ఇంటికి వెళతారు. అప్పుడు శ్రీయ పేరెంట్స్ వాళ్ళను బయటకు వెల్లగొడతారు.దాంతో వాళ్ళు శ్రీయ ఇంటి ఎదురుగా ఉండే వ్యక్తి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానిస్తాడు. అలా వాళ్ళింటికి వెళతారు. అప్పుడు అతను మాకు ఇద్దరు కూతుర్లు ఉన్నారని, వాళ్ళ పేర్లు అక్కమ్మ జక్కమ్మ అని, పరిచయం పెంచుకోండి అని అంటూ ఉంటాడు. అయితే అక్కమ్మ జక్కమ్మలు డీ గ్లామర్ క్యారెక్టర్స్ లో కనిపించేసరికి, ఆ సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి. ఇక కామెడీ కోసమే మూవీలో వాళ్ళను అలా చూపించారని తెలుస్తోంది.
వాస్తవానికి అయితే అక్కమ్మ జక్కమ్మ క్యారెక్టర్స్ చేసిన ఆ ఇద్దరమ్మాయిలు బయట చాలా అందంగా ఉంటారంట. శివాజీ మూవీ కోసమే అలా డీ గ్లామర్ గా కనిపించినట్లు వారి తాజా ఫోటోలను చూస్తే తెలిసిపోతుంది. ఈ మధ్యే ఈ ఇద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇక ఆ ఫోటోలను చూసిన వారు శివాజీ సినిమాలో నటించిన అక్కమ్మ జక్కమ్మ వీరేనా? అందంగా ఉన్నారని తెగ కామెంట్స్ పెడుతున్నారు.

Also Read: ఏ సెలబ్రిటీని చనిపోయిన నాగార్జున చూడడానికి ఎందుకు వెళ్లరు?

Previous article‘అన్ స్టాపబుల్’ షో.. పవన్ ఎపిసోడ్ లో బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!
Next articleప‌వ‌న్ స‌త్యాగ్ర‌హి సినిమా ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.