‘అన్ స్టాపబుల్’ షో.. పవన్ ఎపిసోడ్ లో బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్..!

Ads

నటసింహం బాలకృష్ణ హోస్ట్‌ గా చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్‌ షో కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ టాక్‌ షోలో సందడి చేయబోతున్నారని చాలా రోజుల నుండి వినిపిస్తోంది.

Ads

ఆహా యాజమాన్యం అదిరిపోయేలా పవన్‌ కల్యాణ్‌ షో ఎపిసోడ్ ను ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ మోస్ట్‌ అవైటెడ్‌ పవర్ స్టార్ ఎపిసోడ్‌ చిత్రీకరణ మొదలైంది. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌పై అందరిలోనూ అమితమైన ఆసక్తి నెలకొంది. ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్, అటు నందమూరి ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎందురుచూస్తున్నారు.
అందులోనూ పవన్ కళ్యాణ్ తొలిసారిగా అన్ స్టాపబుల్ షోకు వస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో నిన్న జరిగింది. ఇక ఎప్పుడు లేని విధంగా ఈ టాక్ షో నిర్వాహకులైన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మీడియాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మా టాక్ షోకి రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు.
బాలయ్య పవన్ కళ్యాణ్ కార్ నుండి దిగగానే ఎదురువెళ్ళి, పవన్ ని హాగ్ చేసుకుని గ్రాండ్ స్వాగతం చెప్పి, లోపలకి తీసుకెళ్లాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. బాలకృష్ణ లాంటి ఒక పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ కోసం తన ఈగోని పక్కన పెట్టి, అలా కారు దగ్గరికి వెళ్ళీ మరి తీసుకొచ్చిన తీరుకి పవన్ ఫ్యాన్స్ చాలా నచ్చింది. అభిమనులంతా సోషల్ మీడియా ద్వారా బాలయ్యకి కృతఙ్ఞతలు తెలుపుతున్నారు. ఇక పవన్ ఎపిసోడ్ హైలైట్స్ ఏమిటో చూద్దాం.
పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్, డైరెక్టర్ క్రిష్ ఈ ఎపిసోడ్ కి వచ్చారు. ఇక ఎపిసోడ్ మధ్యలో సాయి ధరమ్ తేజ్ వస్తాడట, బాలయ్య ఈ షోలో పవన్ ని మూడు పెళ్ళిళ్ళ గురించి కూడా అడిగాడంట. బాలకృష్ణ ఈ విషయం గురించి మాట్లాడుతూ పెళ్లిళ్ల గోల ఏంటని పవన్ ని అడిగినపుడు, దానికి పవన్ ఎందుకు మూడు వివాహాల పై వివరణ ఇచ్చాడట. పవన్ వివరణ విన్న తరువాత బాలయ్య ఇంత క్లారిటీ గా చెప్పినా కూడా, ఈ విషయం గురించి విమర్శించే వాళ్ళంత ఊర కుక్కలతో సమానం అని అన్నాడంట. ఇక ఈ ఎపిసోడ్ లో ఇలాంటివే ఉన్నాయంట. ఇద్దరి స్టార్ అభిమనులకి ఒక పండగలాగ ఉంటుందని టాక్.

Also Read: అలీ ప్రేమకథ మరియు బ్రేకప్ గురించిన ఈ విషయాలు తెలుసా?

Previous articleమసూద సినిమాలో నజియా క్యారెక్టర్ చేసిన అమ్మాయి ఎవరో తెలుసా?
Next articleరజనీకాంత్ శివాజీ సినిమాలోని అక్కమ్మ, జక్కమ్మలు బయట ఎలా ఉంటారో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.