విడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. ఎందులో చూడచ్చు అంటే.?

Ads

ఓటీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత చిన్న హీరోలు పెద్ద హీరోలు అనే తేడా ఏమాత్రం లేకపోయింది. ఒకప్పుడు ఒక హీరో సినిమా థియేటర్లో విడుదల అయింది అంటే థియేటర్లోనే వందరోజుల వేడుక చేసేవారు. అయితే ఇప్పుడు పట్టుమని పది రోజులు థియేటర్ లో ఆడే సినిమాలు కూడా లేవని చెప్పాలి. స్టార్ హీరో అయినా మిడిల్ రేంజ్ హీరో అయినా సినిమా విడుదలైనటువంటి రెండు వారాలకి థియేటర్ నుంచి తొలగిస్తున్నారు. అయితే ఇలా థియేటర్ నుంచి తీసేసిన ఈ సినిమాలను నెల తిరగకముందే ఓటీటీలలో ప్రసారం చేస్తున్నారు.

ఈ విధంగా స్టార్ హీరోల సినిమాలు నెలరోజుల వ్యవధిలోనే ఓటీటీలలోకి వచ్చి ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే తాజాగా ఒక స్టార్ హీరో నటించిన సినిమా తెలుగులో విడుదలైనటువంటి రెండు వారాలకే ఓటీటీలో రాబోతుందని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి ఏ హీరో నటించిన ఏ సినిమా విడుదల కాబోతుందనే విషయానికి వస్తే కన్నడ నాట స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటుడు శివరాజ్ కుమార్ తాజాగా ఘోస్ట్ అనే యాక్షన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Ads

సినిమా కన్నడ భాషలో విడుదలైనటువంటి రెండు వారాలకి అంటే నవంబర్ 4వ తేదీ తెలుగులో విడుదలైంది. ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఏంటి అనే విషయం కూడా తెలియకుండానే ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా నవంబర్ 17 నుంచి జీ 5 లో స్ట్రీమింగ్ కాబోతుందని అధికారకంగా ప్రకటించారు. ఇలా ఒక స్టార్ హీరో నటించిన సినిమా విడుదలైనటువంటి రెండు వారాలకే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈయన కేవలం కన్నడ సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాష సినిమాలలో క్యామియో రోల్స్ కూడా చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

Previous articleఅక్టోబర్ సర్వే ప్రకారం టాప్ 10 హీరోయిన్లు వీరే…పొజిషన్లు అన్ని మారిపోయాయిగా.?
Next articleదీపావళికి మొదటిసారి దీపాలను వెలిగించిన ఆ ప్రదేశం ఇప్పుడు “పాకిస్థాన్” లో ఉందా.?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.