దీపావళికి మొదటిసారి దీపాలను వెలిగించిన ఆ ప్రదేశం ఇప్పుడు “పాకిస్థాన్” లో ఉందా.?

Ads

హిందూ గ్రంథాలైన స్కంద పురాణం అగ్ని పురాణం లో దీపాల పండుగ గురించి ప్రస్తావించడం జరిగింది. త్రేతా యుగం, ద్వాపర యుగం కాలం నుంచి ప్రజలు దీపావళి జరుపుకుంటున్నట్లు మన పురాణాల ఆధారంగా మనం నమ్ముతాం. కొన్ని ప్రదేశాలలో దీపావళిని ఐదు రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు. దీపావళి రోజు మనం ఇంటి ముంగిట దీపాలను వెలిగిస్తాం. అయితే మొదటిసారిగా దీపాలను ఎక్కడ వెలిగించారు? బాణాసంచా ఎప్పటినుంచి కాలుస్తున్నారు అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే వాటి గురించి తెలుసుకుందాం పదండి..

సుమారు 5000 సంవత్సరాల క్రితం.. మట్టి దీపాలను ఉపయోగించినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. వీటిని మెహర్‌ఘర్‌లోని పురావస్తు శాఖ బృందం నిర్వహించిన సింధు లోయలోని తవ్వకాలలో కనుగొన్నారు. అయితే ఈ ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్ కిందకి వస్తుంది. ఇప్పటివరకు కనుగొన్నటువంటి దీపాలకు సంబంధించిన వస్తువులలో ఇవి పురాతనమైనది కాబట్టి మొదటి దీపాలు ఇక్కడే వెలిగించి ఉండవచ్చు అని అంచనా.

Ads

కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలోని 14 వ అధ్యాయంలో ‘తేజాంచూర్ణం’ అనే ఒక వర్ణన ఉంది. ఇందులో తేజాన్‌ అని పిలవబడే ఒక పౌడర్ వంటి పదార్థానికి నిప్పు అంటించినప్పుడు నిప్పు రవ్వలు వచ్చాయి అని పేర్కొన్నారు. వీటి ఆధారంగా 2396 సంవత్సరాల క్రితం రాకెట్ ను..అదే మన బాణాసంచాను కాల్చినట్లు తెలుస్తుంది. ఇలా మనకు తెలియని ఎన్నో వింతలు మన కాలాని కంటే ముందే జరిగాయి అన్న విషయం ఇలాంటివి బయట పడ్డప్పుడు అర్థమవుతుంది.

Note: All the images used in this article are just for representative purpose. But not the actual characters.

article sourced from: tv9telugu

Previous articleవిడుదలైన రెండు వారాలకే ఓటీటీలోకి స్టార్ హీరో సినిమా.. ఎందులో చూడచ్చు అంటే.?
Next articleKoti Deepotsavam 2023: దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.