Ads
వన్డే ప్రపంచ కప్ 2023 మ్యాచ్లకు ఇండియా ఆతిథ్యం ఇవ్వడంతో కప్ పై క్రికెట్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టీం ఇండియా వన్డే సిరీస్ పై ఎందరో ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. తొలి వన్డేలో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్మిత 50 ఓవర్లలో 277 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే అతని కంటే కూడా ఒక బౌలర్ తన దారుణమైన పర్ఫామెన్స్ తో అందరి చూపు తన వైపు తిప్పుకున్నాడు.
ఈ నేథ్యంలో అతను ఇప్పుడు ప్రపంచకప్ జట్టులో కూడా ఉండడం పై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. అతను మరెవరో కాదు.. ఆల్ రౌండర్ శార్దుల్ ఠాకూర్. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కూడా చేస్తాడు అనే కారణంతో అతని ప్రపంచ కప్ జట్టులోకి తీసుకోవడం జరిగింది. అయితే అతను ఆడుతున్న మ్యాచ్లలో బౌలింగ్ కి బ్యాటింగ్ కి దేనికి సెట్ కాడు అని…అతని పర్ఫామెన్స్ చూస్తే తెలిసిపోతుంది.
Ads
మ్యాచ్ బాగా గమనిస్తే పొరపాటున అతని బౌలింగ్ లో ఏదన్నా వికెట్ పడితే అది కేవలం లక్ వల్ల వచ్చింది అని ఇట్టే అర్థమవుతుంది. ఇక అతని బ్యాటింగ్ ఎంత చెత్తగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకరకంగా అతని బ్యాటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్లు ఉంటుంది పరిస్థితి. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో 10 ఓవర్లు బౌలింగ్ వేసిన శార్దూల్ 78 పరుగులు ప్రత్యర్ధ జట్టుకి గిఫ్టుగా ఇచ్చాడు. రెండో వన్ డే లో కూడా… 4 ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో అతన్ని ప్రపంచకప్ జట్టులో ఎంపిక చేయడంపై మరొకసారి సోషల్ మీడియా సాక్షిగా క్రికెట్ అభిమానులు పలు రకాల అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదేం బౌలింగ్ రా నాయనా …నీకో దండం నీ బౌలింగ్ కో దండం.. అంటూ మీమ్స్ తో సోషల్ మీడియాని హోరెత్తిస్తున్నారు. అతని స్థానంలో వేరొక ప్లేయర్ని తీసుకుంటే బాగుంటుంది అని అభిప్రాయాన్ని కూడా కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.సిరాజ్, బుమ్రా, షమీ, హార్దిక్ పాండ్యా లాంటి పేసర్లు ఉన్నప్పటికీ మరొక పెసర అవసరం ఏమిటి అతని బదులు ఒక స్పిన్ ఆల్ రౌండర్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు.