Ads
మామూలుగా గుండెపోటు వస్తే చాలా భయపడిపోతూ ఉంటారు. గుండెపోటు అనే మాట వినగానే టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే గుండెపోటు వచ్చినప్పుడు అలాగే వచ్చే ముందు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఎప్పుడైనా సైలెంట్ హార్ట్ ఎటాక్ గురించి మీరు ఉన్నారా? ఇంతకీ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ఇది ఒక రకమైన గుండెపోటు. ఇది చాలా తక్కువ లక్షణాలతో మాత్రమే సంభవిస్తూ ఉంటుంది. ఇది గుండెల్లో మంట లేదా అజీర్ణంగా భావించి మీరు విస్మరించవచ్చు.
Ads
సైలెంట్ హార్ట్ ఎటాక్ అనేది ఎటువంటి లక్షణాలను కూడా చూపించదు. హార్ట్ ఎటాక్ అనేది వచ్చే వారికి మయోకార్డియల్ అనే మచ్చలు ఉంటాయి. ఈ మయోకార్డియల్ మచ్చల ప్రాబల్యం స్త్రీలలో కంటే పురుషులలో ఐదు రెట్లు ఎక్కువ అధికంగా ఉంటుంది. నిశ్శబ్ద గుండెపోటుకు ప్రమాద కారకాలు మధుమేహం, అధిక రక్తపోటు, వృద్ధాప్యం, ధూమపానం, ఊబకాయం, నిశ్చల జీవనశైలి, గుండె జబ్బుల కుటుంబ చరిత్ర , అధిక కొలెస్ట్రాల్. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లు తరచుగా సైలెంట్ హార్ట్ ఎటాక్ లను గురవుతూ ఉంటారు. వీటి లక్షణాల విషయానికొస్తే చాతి నొప్పి, ఛాతిలో అసౌకర్యంగా అనిపించడం, దవడ, మెడ లేదా వీపులో నొప్పి, చేతులు భుజాలు అసౌకర్యంగా అనిపించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఇవన్నీ కూడా సైలెంట్ హార్ట్ ఎటాక్ లక్షణాలు.
అయితే ఈ గుండెపోటును ఎలా నివారించవచ్చు అన్న విషయానికి వస్తే.. అనారోగ్య జీవనశైలి తరచుగా గుండెపోటుకు ప్రధాన కారణం. శారీరక శ్రమ లేకపోవడం, అసమానమైన నిద్ర, పొగాకు తాగడం, అతిగా తాగడం, తగినంత పోషకాహారం తీసుకోకపోవడం, ఇంట్లో ఆహారానికి బదులుగా బయట ఫుడ్ పై ఆధారపడడం, ఆహారంలో అనారోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయకపోవడం వంటి అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లు. ప్రాణాంతక వ్యాధులకు దారి తీస్తుంది. ఇటువంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే వైద్యున్ని సంప్రదించడం మంచిది.