పవన్ కళ్యాణ్‌, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?

Ads

నందమూరి తారకరత్న కన్నుమూయడంతో అటు నందమూరి, ఇటు నారా ఫ్యామిలీలో తీవ్ర విషాదం అలుముకుంది. తారకరత్న గత ఇరవై మూడు రోజులుగా బెంగుళూరు నారాయణ హృదయాలయలో ట్రీట్మెంట్ పొందుతూ, ఫిబ్రవరి 18న తుదిశ్వాస విడిచారు.

అయితే ఆయన కోలుకుని, క్షేమంగా తిరిగి వస్తారని నందమూరి కుటుంబ సభ్యులు, నందమూరి అభిమానులు, తెలుగు దేశం పార్టీ వర్గాల వారు అనుకున్నారు. తారకరత్న కోలు కోవడం కోసం అభిమానులు, పార్టీకి చెందిన వారు పూజలు, ప్రార్థనలు చేశారు. కానీ వారి ప్రార్దనలు ఫలించలేదు. 39 సంవత్సరాలకే తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. తారకరత్న మహా శివరాత్రిరోజునే శివైక్యం అయ్యారు. ఆయన మరణ వార్తతో ఇండస్ట్రీ వారంతా షాక్ కు లోనయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుండి సినీ పరిశ్రమ, రాజకీయ రంగాలకు చెందిన అందరు తారకరత్నకు సంతాపం వ్యక్తం చేస్తూ, నివాళులు అర్పిస్తున్నారు. ఇక తారకరత్న బాబాయ్ బాలకృష్ణ బాధ వర్ణనాతీతం. బాలకృష్ణను చూసిన వెంటనే తారక రత్న కుమార్తె నిషిక వచ్చి బాలయ్యను ఆలింగనం చేసుకోవడం అక్కడ ఉన్న అందరిని కలచివేసింది. తారక రత్న ఆరోగ్యంగా తిరిగి రావాలని బాలయ్య ప్రత్యేక పూజలు చేశారు. ఆయన తారక రత్న భౌతికకాయాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు.అంతేకాకుండా తారకరత్న ఫ్యామిలీ తమ ఫ్యామిలిలో భాగమని, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డిని, ఆయన ముగ్గురు పిల్లల బాధ్యత కూడా తానే చూసుకుంటానని వారికి మాట ఇచ్చారు. విజయ సాయి రెడ్డి మాట్లాడుతూ బాలయ్యకి తారక రత్న ఫ్యామిలీ రుణపడి ఉంటుందని అన్నారు.

Ads

ఇదిలా ఉండగా ప్రభాస్ నాన్న, రెబల్ స్టార్ కృష్ణం రాజు తమ్ముడు అయిన ఉప్పలపాటి సూర్య నారాయణ రాజు కూడా మహా శివరాత్రి నాడే శివైక్యం అయ్యారు. ఆయన 2010లో ఫిబ్రవరి 12న మరణించారు. ఆయన నిర్మాతగా కృష్ణం రాజుతో ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు.పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ జంటకు మొదట కుమారుడు అకీరా ఆ తర్వాత కూతురు ఆద్య జన్మించిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆద్య 2010లో మహా శివరాత్రి రోజున జన్మించినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ తండ్రి, నందమూరి తారక రత్న ఇద్దరు శివరాత్రి నాడే శివైక్యం అవడం యాధృచ్చికం.
Also Read: టాలీవుడ్ లో త్రిపాత్రాభినయం చేసిన 9 మంది హీరోలు వీరే..

Previous articleఈ 4 గురు ఆట‌గాళ్లు ఇన్స్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కు ఎన్ని కోట్లు సంపాదిస్తారో తెలుసా?
Next articleప్రాణస్నేహితుడు మరణించినా చివరి చూపుకు వెళ్ళని రజినీకాంత్.. ఎందుకో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.