ఈ 4 గురు ఆట‌గాళ్లు ఇన్స్ స్టాగ్రామ్ లో ఒక్క పోస్ట్ కు ఎన్ని కోట్లు సంపాదిస్తారో తెలుసా?

Ads

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి. ఈ సైట్‌లో రెండు బిలియన్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్ లో కొంతమంది సెలబ్రిటీలు వారు పెట్టె ఒక్కో పోస్ట్‌కు రెండు మిలియన్ డాలర్ల వరకు తీసుకుంటున్నారు. ఇది నమ్మశక్యంగా లేకున్నా,ఇది వాస్తవమే.

ఫోటో-షేరింగ్ ప్లాట్‌ఫామ్‌లో స్టార్స్ కు ఉండే ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఉన్నారు. దాంతో వారు పోస్ట్ చేయడం ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికంగా సంపాదిస్తున్న టాప్ 4 క్రీడాకారులు వారు పెట్టె ఒక్కో పోస్ట్‌కు ఎంత మొత్తం తీసుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..
1. క్రిస్టియానో ​​రొనాల్డో: $19.8 కోట్లు, 550 మిలియన్ ఫాలోవర్స్.
క్రిస్టియానో రొనాల్డో గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. క్రిస్టియానో ​​ ప్రపంచంలోనే అత్యంత పాపులారిటీ పొందిన ఫుట్‌బాల్ ప్లేయర్స్ లో ఒకరు. క్రిస్టియానో పోర్చుగీస్ ఫుట్‌బాల్ ప్లేయర్. ఎక్కువగా స్పోర్ట్స్ బ్రాండ్ కోసం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌ల ద్వారా బాగా సంపాదిస్తున్నాడు. ఆయన తన పోస్ట్ లలో తరచుగా బ్రాండ్ గురించి చెప్తూ, క్యాప్షన్ వ్రాస్తుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by Cristiano Ronaldo (@cristiano)

2. లియో మెస్సీ- $14.7 కోట్లు, 432 మిలియన్ ఫాలోవర్స్.
అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ. అత్యంత ప్రజాదరణ పొందిన ఫుట్‌బాల్ ఆటగాళ్లలో మెస్సీ ఒకరు. అతను అర్జెంటీనా నేషనల్ జట్టు మరియు స్పానిష్ క్లబ్ బార్సిలోనా రెండింటికీ ఆడతాడు.మెస్సీ స్పోర్ట్స్, ఫిట్‌నెస్ బ్రాండ్‌లు మత్రమే కాకుండా చాలా బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు చేసాడు.

 

View this post on Instagram

 

A post shared by Leo Messi (@leomessi)

Ads

3. విరాట్ కోహ్లీ: $13.1 కోట్లు, 237 మిలియన్ ఫాలోవర్స్.
విరాట్ కోహ్లీ కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కోహ్లీని అత్యుత్తమమైన సమకాలీన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా చాలా మంది భావిస్తారు. కోహ్లీ జాతీయజట్టులోనూ, ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడతాడు. 2020కి గాను ప్రపంచంలో అత్యధికంగా సంపాదించే టాప్ 100 క్రీడాకారుల లిస్ట్ లో కోహ్లీకి 66వ స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ 2018లో ఇండియాలో అత్యున్నత క్రీడా పురస్కారం అయిన రాజీవ్ గాంధీ ఖేల్ రత్నను కూడా అందుకున్నాడు. కోహ్లీ ఈమధ్యకాలంలో ఇన్‌స్టాగ్రామ్‌ లో మింత్రా కోసం వ్రాగ్న్ స్టైల్‌లను ప్రమోట్ చేస్తూన్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

4. నెయ్ మార్ : 7.8 కోట్లు, 204 మిలియన్ ఫాలోవర్స్.
నెయ్ మార్ బ్రెజిలియన్ ఫుట్‌బాల్ ఆటగాడు. అతను బ్రెజిల్ జాతీయ జట్టు, ఫ్రెంచ్ క్లబ్ పారిస్ సెయింట్-జర్మైన్ కోసం ఆడతాడు. అతను ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యాడు. నెయ్ మార్ ఇప్పుడు మెస్సీ, రొనాల్డో వంటి దిగ్గజాల లిస్ట్ లో స్థానం పొందాడు.ఈ ప్లేయర్ స్పోర్ట్స్, ఫిట్‌నెస్ బ్రాండ్‌లను ప్రమోట్ చేస్తుంటాడు.

 

View this post on Instagram

 

A post shared by PUMA Football (@pumafootball)

Also Read:రిటైర్ అయ్యాక క్రికెటర్లు ఏం చేస్తారు..? ఈ 4 క్రికెటర్లు ఏం చేస్తున్నారో తెలుసా..?

Previous articleఒక్కరు చాలు .. ఇద్దరు పిల్లలు వద్దని అనుకుంటున్నారా? అయితే ఆలోచించాల్సిందే..!
Next articleపవన్ కళ్యాణ్‌, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.