Ads
టీం ఇండియా స్పాన్సర్ కంపెనీ ‘డ్రీమ్ 11’సరికొత్త వివాదంలో చిక్కుకుంది. 17 వేల కోట్లు రూపాయలు పన్ను రూపంలో చెల్లించాల్సిందిగా డ్రీమ్ 11 కు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు జారీచేసింది. ఈ వార్త బయటకు రావడంతో ఈ కంపెనీకి సంబంధించిన షేర్ ధరలు కూడా బాగా పడిపోయాయి.
ఇన్కమ్ టాక్స్ చట్టం ప్రకారం ఆన్లైన్లో జూదం లేక క్యాసినోలు నిర్వహిస్తే ప్రభుత్వానికి సుమారు 28 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.అయితే ‘డ్రీమ్ 11’ అసోసియేట్ కంపెనీలు ఆన్లైన్లో గాంబ్లింగ్ నడుపుతూ ఉండడంతో…లెక్కల ప్రకారం 28% పన్ను చెల్లించాల్సిందిగా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ నోటీస్ అందించింది.
అయితే డ్రీమ్ 11 కంపెనీ తమకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు అందించడానికి ముంబై హైకోర్టులో సవాలు చేసింది. అయితే ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ విషయంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇలా టీం ఇండియా స్పాన్సర్ చేస్తున్న కంపెనీలు ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు అన్న విషయం చర్చకు వచ్చింది.
Ads
గత 15 సంవత్సరాలుగా భారత్ క్రికెట్ జట్టుకి స్పాన్సర్ లుగా వ్యవహరించిన కంపెనీలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. సుదీర్ఘకాలం పాటు టీమ్ ఇండియాకు స్పాన్సర్ గా వ్యవహరించిన ‘సహారా ఇండియా’ సంస్థ దివాలా తీసింది. తప్పుడు లెక్కలు చూపించారు అన్న ఆరోపణతో సహారా యజమాని జైలుకే వెళ్ళాడు. కొంతకాలం టీమిండియా కు స్పాన్సర్ చేసిన స్టార్ స్పోర్ట్స్ ఛానల్ కూడా ఇబ్బందుల్లో పడింది.
చైనా మొబైల్ కంపెనీ ఒప్పో కూడా భారత్ క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరించింది. అయితే చైనా భారత్ మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కారణంగా …దేశంలో చైనా వస్తువుల డిమాండ్ పడిపోవడంతో కంపెనీ విలువ తగ్గిపోయింది.. తర్వాత ‘బైజూస్’ సంస్థ క్రికెట్ స్పాన్సర్షిప్ రంగంలోకి దిగింది.ప్రస్తుతం ఈ సంస్థ కూడా క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇక టీమిండియా సరికొత్త డ్రీమ్ స్పాన్సర్ డ్రీమ్ 11 కూడా చిక్కుల్లో మునిగి తేలుతుంది.