Ads
డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలు చేస్తూ ముందుకు వెళుతున్న హీరో సుహాస్. ఇప్పుడు సుహాస్ హీరోగా నటించిన మరొక సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా పేరు శ్రీరంగనీతులు. ఈ సినిమాలో సుహాస్ తో పాటు, విరాజ్ అశ్విన్, కార్తీక్ రత్నం కూడా హీరోలుగా నటించారు. రుహాని శర్మ హీరోయిన్ గా నటించారు. ముగ్గురి కథల ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఇందులో ఇద్దరు ప్రేమికులు. ఈ సినిమా ఇప్పుడు ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, వెంకటేశ్వరరావు నిర్మించారు. హర్షవర్ధన్ రామేశ్వర్, అజయ్ అరసాడ సంగీతం అందించారు.
ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, శివ (సుహాస్) తన తల్లితో కలిసి ఒక బస్తీలో ఉంటాడు. శివ ఒక చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఒక్కసారైనా ఒక పెద్ద ఫ్లెక్సీలో తనని తాను చూసుకోవాలి అని శివ ఆశ పడుతూ ఉంటాడు. ఒకసారి అలాగే తన ఫ్లెక్సీ పెట్టించుకుంటాడు. కానీ అది కనపడకుండా పోతుంది. దాంతో ఇంకో ఫ్లెక్సీ పెట్టించుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు. కార్తీక్ (కార్తీక్ రత్నం) తల్లిని, తండ్రిని, తమ్ముడిని, ఎవరిని పట్టించుకోకుండా తిరుగుతూ ఉంటాడు. ప్రతిసారి జైలుకి వెళ్తూ ఉండడం, కార్తీక్ తండ్రి విడిపించుకుని రావడం. ఇది జరుగుతూ ఉంటుంది.
Ads
కార్తీక్ ని మార్చాలి అని తండ్రి కష్టపడుతూ ఉంటాడు. వరుణ్ (విరాజ్ అశ్విన్), ఐశ్వర్య (రుహాని శర్మ) ప్రేమించుకుంటూ ఉంటారు. ఐశ్వర్య తన తండ్రికి తన ప్రేమని చెప్పడానికి భయపడుతుంది. ఒకరోజు ఐశ్వర్య గర్భవతి అని తెలుస్తుంది. ఇంట్లో వాళ్లకి విషయం చెప్పేద్దాం అని వరుణ్ ఎన్ని సార్లు చెప్పినా కూడా ఐశ్వర్య వినదు. వీళ్ళ ముగ్గురు జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి అనేది కథ. ముగ్గురి, నలుగురి జీవితాలని కలిపి ఒక సినిమాగా తీయడం అనేది ఇటీవల చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్క ట్రాక్ లో కొన్ని సీన్స్ బాగున్నాయి. కానీ మొత్తంగా చూస్తే మాత్రం బలహీనంగా రాసినట్టు అనిపిస్తాయి.
ఐశ్వర్య అనే పాత్రని తెలివిగల అమ్మాయిగా చూపిస్తారు. కానీ అలాంటి అమ్మాయి ఇలాంటి తెలివి తక్కువ నిర్ణయాలు ఎందుకు తీసుకుంటోంది అనేది క్లారిటీ లేదు. శివ ఒక ఫ్లెక్సీ కోసం ఇంత ఎందుకు ఆరాట పడ్డాడు అనే విషయం మీద కూడా స్పష్టత లేదు. టిజో టామీ సినిమాటోగ్రఫీ బాగుంది. పాటలు కూడా సినిమాకి తగ్గట్టు ఉన్నాయి. సీన్స్ ఇంకా బలంగా రాసుకొని ఉంటే ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవి. మొత్తంగా శ్రీరంగనీతులు సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.