Ads
ప్రేమదేశం మూవీతో అమ్మాయిల కలల రాకుమారుడు గా మారిన హీరో అబ్బాస్. నటించిన మొదటి చిత్రంతోనే ఎవరు ఊహించనంత స్టార్ డం సొంతం చేసుకున్న ఈ హీరో తరువాత తెలుగు, తమిళ్ ,మలయాళం, కన్నడ ,హిందీ, ఇలా అన్ని భాషలలో సినిమాలు చేశాడు. ఎంత వేగంగా స్టార్డం వచ్చిందో అంతే వేగంగా అవకాశాలు పడిపోవడం మొదలుపెట్టాయి. మెయిన్ హీరో క్యారెక్టర్ నుంచి సైడ్ ఆర్టిస్ట్ రూల్స్ వరకు పలు విభిన్న పాత్రలలో అబ్బాస్ నటించారు.
కానీ 2015 తర్వాత దాదాపు 8 ఏళ్ల పాటు అబ్బాస్ సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇండియా వదిలి న్యూజిలాండ్ చేరుకున్న అబ్బాస్ రీసెంట్గా ఇండియాకి తిరిగి రావడం జరిగింది. ఈ క్రమంలో తాను ఇండస్ట్రీకి దూరంగా ఉండడానికి గల కారణాన్ని తాజాగా ఇంటర్వ్యూలో అబ్బాస్ వెల్లడించారు. హీరో అయిన తర్వాత తన జీవితంలో ఎదుర్కొన్నటువంటి పలువుడుకుల గురించి చెప్పి ఆయన ఎమోషనల్ కూడా అయ్యారు.
Ads
హీరోగా అద్భుతమైన కెరియర్ ని మొదలుపెట్టిన అబ్బాస్ ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలి అనుకున్నాడు. బైక్ మెకానిక్‌గా,టాక్సీ డ్రైవర్‌గా కూడా పనిచేసిన సందర్భాలు ఉన్నాయని అబ్బాస్ పేర్కొన్నారు. అయితే కోవిడ్ సమయంలో ‘జూమ్’ ద్వారా తన అభిమానులకు చేరువ కాగలిగానని తనలాగా ఆత్మహత్య చేసుకోవాలి అనుకునే వారితో మాట్లాడి ఆలోచనలను మార్చగలిగాను అబ్బాస్ పేర్కొన్నారు.
కెరియర్ మొదలుపెట్టినప్పుడు మంచి అవకాశాలతో పాటు విజయాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత వరస పరాజయాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో.. దొరికిన పాత్రలు చేయాల్సి వచ్చిందని. కానీ ఇది నచ్చక తన పనిని ఆస్వాదించలేకపోవడంతో ,సినిమాలకు గుడ్ బై చెప్పి న్యూజిలాండ్ కు వెళ్లాలని అబ్బాస్ పేర్కొన్నారు. తన కుటుంబాన్ని పోషించడానికి న్యూజిలాండ్ వెళ్లిన అతను బైక్ మెకానిక్ గా మరియు టాక్సీ డ్రైవర్ గా పనిచేయడానికి కూడా వెనకాడ లేదని అబ్బాస్ చెప్పారు. ఒక స్టార్ హీరోగా ఉండి ఆఖరికి టాక్సీ డ్రైవర్ గా మారిన అబ్బాస్ స్టోరీ విని అభిమానులు బాధపడ్డారు.