మూవీలో క్యారెక్టర్ కోసం గుండుతో కనిపించడానికి కూడా జంకని స్టార్స్ ….

Ads

సినిమాని తీయడం అంటే సామాన్యమైన విషయం కాదు. కథ, కథనం ఎంత ముఖ్యమో …పాత్రలు …వాటికి తగిన వేషధారణ ఉండడం కూడా అంతే అవసరం. చాలా సందర్భాలలో తమ పాత్రలకు సెట్ అవ్వడం కోసం నటీనటులు తమ వేషధారణలో విపరీతమైన మార్పులు చేసుకుంటారు. ఎక్కువగా సినీ ఫీల్డ్ అంటే గ్లామరస్ రోల్స్ కి పెద్ద పీట అన్న అప నమ్మకం ఉంది. దీని తారుమారు చేస్తూ ఎందరో తారలు అవసరాన్ని బట్టి తెరపై బొడి గుండుతో కనిపించడానికి కూడా వెనకాడ లేదు.

Surya Ghajini Movie Blockbuster Interesting Scene | Telugu Movie Scenes | Volga Videos - YouTube

ప్రస్తుతం మాస్ యాంగిల్ లో ఎంత డీ గ్లామర్ పాత్ర చేస్తే అంత క్రేజ్ అనే స్థితికి సినీ ఇండస్ట్రీ వచ్చింది. విడుదలకు సిద్ధంగా ఉన్న జవాన్ చిత్రం దగ్గర నుంచి 1996లో వచ్చిన వెంకటేష్ చిత్రం వరకు.. సందర్భాన్ని బట్టి బోడిగుండుతో నటించిన తారలు ఎందరో. అయితే కొందరు నిజంగా సినిమా కోసం గుండు చేయించుకుంటే మరికొందరు అవసరానికి బాల్డ్ కేప్ ని ఏదేమైనాప్పటికీ అంత ధైర్యంగా ఆన్ స్క్రీన్ డి గ్లామర్ రోల్ లో కనిపించడం అంటే ఆషామాషీ కాదు కదా.మరి వారెవరో ఈ రోజు చూద్దాం..

వెంకటేష్

స్టైల్ కి మారుపేరుగా ఉండే వెంకటేష్ 1996లో ఈవీవీ సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు చిత్రంలో ఒక కామెడీ సీన్ కోసం బోడి గుండు గెటప్ తో కనిపించారు.

Ads

రాజశేఖర్

జీవిత మొదటి సారి రాజశేఖర్ హీరోగా డైరెక్ట్ చేసిన సినిమా శేషు. ఇందులో అసైలంలో చేరిన సమయంలో రాజశేఖర్ గుండు తో కనిపిస్తారు. హృదయాన్ని హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది.

ప్రియాంక చోప్రా

మేరీకామ్ జీవిత కథ ఆధారంగా నిర్మించిన స్పోర్ట్స్ మూవీ మేరీకామ్ మూవీలో ప్రియాంక గుండు తో కనిపిస్తారు.

రజినీకాంత్

తన పేరుని ఒక బ్రాండ్ గా మార్చుకున్న రజనీకాంత్ 2007 శివాజీ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశంలో బాస్ గుండు బాస్…అంటూ గుండు తో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తమన్నా

2011 లో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఎన్టీఆర్ తమన్నా కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఊసరవెల్లి. అందులో తమన్నా తన అన్న వదినలను పోగొట్టుకున్న తర్వాత బుల్లెట్ తగిలి హాస్పిటల్ లో చేరిన సమయంలో ఆమెకు ఆపరేషన్ నిమిత్తం గుండు చేస్తారు. ఈ సీన్లో తమన్నా యాక్షన్ ఎంతో హార్ట్ టచింగ్ గా ఉంటుంది.

Previous articleటాక్సీ డ్రైవర్ గా మారిన ఒకప్పటి కలల రాకుమారుడు..
Next articleతెలుగులో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి కనుమరుగైన 5 గురు హీరోలు..