Ads
ముత్తువేల్ కరుణానిధి అలియాస్ కరుణానిధి. అందరికీ తెలిసిన వ్యక్తి. తమిళనాడు రాజకీయ పార్టీ అయిన ద్రవిడ మున్నేట్ర కళగంకు అధ్యక్షుడిగాక తన సేవలను అందించారు. తమిళనాడుకి ఐదు సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. కరుణానిధి రాజకీయ జీవితం దాదాపు 60 సంవత్సరాలు ఉంటుంది. అన్ని సంవత్సరాలలో పోటీ చేసిన ప్రతి ఎన్నికలలో కూడా కరుణానిధి గెలిచారు.
కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధి తల్లిదండ్రుల పేర్లు ముత్తువేలర్, అంజుగం. 1924 లో, జూన్ 3వ తేదీన తంజావూరులోని తిరుక్కువలైలో ఆయన జన్మించారు. కరుణానిధి మంచి సాహితీవేత్త కూడా. తమిళ సాహిత్యంలో కరుణానిధి ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు. సినిమాలు, సినిమాల్లో డైలాగ్స్, కవితలు, నవలలు, పద్యాలు, నాటికలు ఇలా ఎన్నో రాశారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన మొదటి వ్యక్తిగా కరుణానిధి ఘనత సాధించారు. 1942 లో కరుణానిధి మురసోలి అనే పత్రికను ప్రారంభించారు.
Ads
కరుణానిధి వ్యక్తిగత జీవితం కూడా అందరికీ తెలిసిందే. అయితే, కరుణానిధి మొదటిగా ఒక వ్యక్తిని ప్రేమించారు. ఆమెని పెళ్లి చేసుకోలేకపోయారు. ఈ విషయం గురించి కరుణానిధి 2013 లో మాట్లాడారు. తాను ఆచరించే విలువల కారణంగా తను ప్రేమించిన అమ్మాయిని కూడా వదులుకున్నట్టు తెలిపారు. వన్ ఇండియా డాట్ కామ్ కథనం ప్రకారం, కరుణానిధిని 1944 లో తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోమని ఆ అమ్మాయి తల్లిదండ్రులు అడిగారు.
ఆ అమ్మాయి చాలా సాంప్రదాయాలు పాటించే కుటుంబం నుండి వచ్చిన అమ్మాయి. మంత్రాలు, పద్ధతులు పాటించకుండా పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఒకవేళ అలా ఏవి పాటించకుండా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం తమ కూతురిని కరుణానిధికి ఇవ్వాలి అని అనుకోవట్లేదు అని చెప్పారు. కరుణానిధి అవన్నీ పాటించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఈ కారణంగానే కరుణానిధి తను ప్రేమించిన అమ్మాయికి దూరం అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత కరుణానిధి దయాలు అనే ఆవిడని పెళ్లి చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు కూడా ఉన్నారు.