Ads
పెళ్లి అంటే ఏమిటి? అని మిమ్మల్ని ఎవరైనా సడన్ గా అడిగారనుకోండి సమాధానం ఏమి ఇస్తారు…బాగా చదువుకున్న వాళ్ళైతే…అది ఒక ఎమోషన్ అంటారు. సాంప్రదాయాన్ని పాటించేవారు జన్మజన్మల బంధం అంటారు.. ఇలా భాష ఏదైనా ..కులం, మతం ఏదైనా సరే ప్రతి ఒక్కరూ పెళ్లి అనే పవిత్ర బంధాన్ని గౌరవిస్తారు. అయితే ఈ ప్రశ్నకి ఒక విద్యార్థి రాసిన జవాబు మాత్రం వెరైటీగా ఉండడమే కాకుండా, ప్రస్తుతం పిల్లలకు పెద్దలు పెళ్లి గురించి ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు అని అనుమానాన్ని కలిగిస్తుంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో పెళ్లి గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి మీమ్స్ చేసి దాన్ని ఏదో పెద్ద జోక్ లాగా చేస్తున్నారు. కొందరైతే పెళ్లి కాని వారికి అది కమ్మటి కల ..కానీ పెళ్లి అయిన వాళ్ళకి పీడకల అంటూ మాలోని కవిత్వాన్ని వలకబోసి ఏదో సాధించామని ఫీల్ అవుతారు. ఇంతకీ ఆ విద్యార్థి రాసిన సమాధానం ఏమిటో తెలుసా.. పెళ్లి ఎందుకు చేసుకుంటారు అనే ప్రశ్నకి అతను రాసిన ఆన్సర్ మార్కులు అయితే తేలేదు కానీ సోషల్ మీడియాలో బాగా వైరల్ చేసింది.
Ads
పెళ్లి ఎందుకు చేసుకుంటారు అంటే.. నువ్వు పెద్ద దానివయ్యావు, నీకు ఇక మేము తిండి పెట్టలేము ..తిండి పెట్టే వ్యక్తిని చూసి పెళ్లి చేసుకో అని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతారట. ఇక అప్పుడు అమ్మాయి ఒక అబ్బాయిని కలుసుకోవడం జరుగుతుంది. అబ్బాయి ఇంట్లో కూడా పెళ్లి చేసుకో అని అరుస్తుంటారు కాబట్టి ఆ అబ్బాయి అమ్మాయి కలిసి పెళ్లి చేసుకుని బతకడం స్టార్ట్ చేస్తారు. ఇక తర్వాత కొన్ని చెత్త పనులు చేసి పిల్లలను కంటారు…అని రాశాడు అబ్బాయి. పాపం అతని సమాధానానికి బిత్తర పోయిన ఆ టీచర్.. ఆన్సర్ ని కొట్టివేసింది. అయితే నెటిజన్లు మాత్రం చిన్న వయసులోనే పెళ్లి గురించి చెప్పిన అపరజ్ఞాని అని అబ్బాయిని తెగ పొగుడుతున్నారు. మరి మీరు ఏమి అనుకుంటున్నారు..
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Paari ᵃᵗᵐᵃⁿ | Panchavan Paarivendan (@srpdaa) October 11, 2022