Ads
ఓటీటీ వచ్చాక భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తున్నారు. అందుకే మిగిలిన భాషల సినిమాలు కూడా తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అలా ఇటీవల ఒక తమిళ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.
నలుగురు అమ్మాయిల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమా పేరు కన్నాగి. కళై, నది, నేత్ర, గీత అనే పేర్లలో వచ్చే మొదటి అక్షరాలు కలిపితే వచ్చే సినిమా పేరు ఇది. ఇంక సినిమా కథ విషయానికి వస్తే, కళై (అమ్ము అభిరామి) ఒక ఊరిలో నివసిస్తుంది.
పెళ్లి కోసం తన ఇంట్లో వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. ఎన్ని పెళ్లి చూపులు చూసినా సరే తనకి పెళ్లి అవ్వదు. నది (షాలిని జోయ) ఒక మోడ్రన్ అమ్మాయి. ప్రేమ, పెళ్లి లాంటి వాటి మీద నమ్మకం ఉండదు. ఒక అబ్బాయి తో బ్లైండ్ డేట్ కి వెళుతుంది. కేవలం ఒకటే రిలేషన్ షిప్ లో ఉండడం తనకి నచ్చదు. నేత్ర (విద్య ప్రదీప్) భర్త బలవంతంగా విడాకులకు అప్లై చేస్తాడు. దాంతో నేత్ర మరొక లాయర్ ని ఆశ్రయిస్తుంది. విడాకుల మీద కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది.
నేత్ర భర్త నేత్ర మీద ఆరోపణలు మోపుతాడు. మామగారి మీద కూడా ఏవేవో ఆరోపణలు వేసింది అని పేర్కొంటారు. గీత (కీర్తి పాండియన్) అనుకోకుండా ప్రెగ్నెంట్ అవుతుంది. దాంతో, తనని ఇష్టపడిన వ్యక్తి యశ్వంత్ (యశ్వంత్ కిషోర్) కి ఈ విషయాన్ని చెప్తుంది. యశ్వంత్ డైరెక్టర్ గా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అనుకోకుండా కళై తండ్రి చనిపోతాడు. నది మానసికంగా డిస్టర్బ్ అవుతుంది. నేత్ర విడాకులు తీసుకుందాం అని నిర్ణయించుకుంటుంది. గీత బిడ్డ తనకి వద్దు అనుకుంటుంది.
Ads
ఆ తర్వాత వీళ్ళ జీవితాల్లో జరిగిన సంఘటనలు ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీరు సినిమా చూడాల్సిందే. సినిమాలో ఆడవాళ్లకు సంబంధించిన చాలా విషయాలని చూపించారు. బయట మాట్లాడుకోవడానికి ఇబ్బంది పడే విషయాలను కూడా సినిమాలో చూపించారు. డైరెక్టర్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. అయితే సినిమా క్లైమాక్స్ చూస్తే మాత్రం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా అ! గుర్తొస్తుంది. సినిమా మధ్య మధ్యలో కాస్త డ్రాగ్ చేసినట్టు ఉన్నా కూడా కథ కొత్తగా అనిపిస్తుంది.
నేత్ర చేసే కొన్ని పనులు మాత్రం ప్రేక్షకులకి అంత కన్విన్సింగ్ గా అనిపించవు. ఆమె ప్రవర్తన చాలా గందరగోళంగా ఉంటుంది. అసలు ఆమె ఏం చేస్తోంది అనే విషయం కూడా ఎవరికీ అర్థం కాదు. కేవలం ఆమె ప్రవర్తన కారణం కనిపెట్టాలి అంటే కూడా సినిమా చివరి వరకు చూడాల్సిందే. ఈ సినిమా తమిళ్ లో చూస్తే బాగానే ఉంటుంది కానీ తెలుగు డబ్బింగ్ మాత్రం అంత సెట్ అవ్వలేదు. తెలుగులో అయితే పాటలు అసలు వినలేం. ఎడిటింగ్ బాగానే ఉంటుంది. నటీనటులు అందరూ బాగానే నటించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమాలో కొన్ని ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా డిజైన్ చేసుకున్నారు.
ఇలాంటి సీన్స్ రాయాలి అంటే అది చాలా తక్కువ మంది చేస్తారు. డైరెక్టర్ ఎలాంటి ఒక అడుగు వేశారు అని అనిపిస్తుంది. ఆడవాళ్ళ మీద జరుగుతున్న విషయాలని చెప్పడానికి ప్రయత్నించారు. చాలా అంశాల గురించి ఈ సినిమాలో మాట్లాడారు. మహిళలు ఎదుర్కొనే సంఘటనలను తెర మీద చూపించారు. అందులో కొన్ని ఎమోషనల్ గా అనిపిస్తాయి. కాస్త డిఫరెంట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలని ఇష్టపడేవారు ఈ సినిమాని తప్పక చూడండి. సాధారణ సినిమాలు చూసే వారికి మాత్రం ఈ సినిమా కాస్త కొత్తగా అనిపిస్తుంది.
ALSO READ : విలన్ గా కూడా నటించి మెప్పించిన 8 మంది హీరోయిన్లు వీరే…ఎవరు ఏ సినిమాలో నెగటివ్ రోల్ అంటే.?