Ads
ఇటీవల కాలంలో చాలామంది పంచదార తినడం వల్ల హాని చేస్తుంది. అందువల్ల పంచదారకు బదులుగా బెల్లంను వాడుకోవాలని, బెల్లం ఆరోగ్యానికి మంచిది అని సలహాలు, సూచనలు చేయడం చూస్తూనే ఉన్నాము. అయితే ఇలా అనడం వల్ల చాలా మందికి పంచదారను అసలు వాడకూడదా.
Ads
బెల్లం తీసుకువవడం మంచిదేనా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు పంచదార, బెల్లం రెండు చెరుకు నుండే తయారు చేస్తారు. మరి పంచదార మంచిది కాదు, బెల్లం ఎందుకు మంచిది అని ప్రశ్నిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్వీట్లు తినని వారు, ఇష్టపడని వారు అరుదుగా ఉంటారని చెప్పవచ్చు. ఇక స్వీట్లను చూడగానే నోరుతుంది. ఒక్కటైనా నోట్లో వేసుకోకుండా ఉండలేరు. అయితే చక్కరతో చేసిన స్వీట్స్ తినడకూడదని, బెల్లంతో చేసినవి తింటే ఆరోగ్యం అని ఎక్కువగా వినిపిస్తోంది. టీలో కూడా బెల్లంను ఊపయోగించాలని చెబుతున్నారు. అయితే పంచదార, బెల్లంను చెరకు రసం నుండి తయారు చేస్తారు. దాంతో అందరిలోనూ ఎందుకు పంచదార తీసుకోకూడదు. బెల్లం ఎందుకు తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తుతోంది.
చెరకు రసాన్ని ఉడకబెట్టి సాంప్రదాయ పద్ధతులలో బెల్లంను తయారు చేస్తారు. పూర్తిగా శుద్ది కానీ బెల్లంలో విటమిన్లు, నుము, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలతో పాటు, సుక్రోస్ 75 – 85 శాతం ఉంటుంది. అయితే ఈ పోషకాలు శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక పంచదార చెరకు నుండి ఎన్నో ప్రాసెస్‌ల ద్వారా తయారు చేస్తారు. అతి శుద్ధి చేయడం వల్ల ఇందులో ఉండే పోషక విలువలు చాలా తగ్గుతాయి. ఇందులో సుక్రోస్ 99.8 శాతం వరకు ఉంటుంది.
గ్లూకోస్, ఫ్రక్టోస్ లు సమానంగా కలిగిన పదార్థం సుక్రోస్. ఇది చెరకులో ఎక్కువగా ఉంటుంది. దీనినే చెక్కెర అని అంటారు. రక్తంలో గ్లూకోస్ స్థాయిలు పరిధి దాటి పెరిగితే మధుమేహం (డయాబెటీస్) వస్తుంది. బెల్లంలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు ఫైబర్ కంటెంట్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నెమ్మదిగా పెరగడానికి దోహదం చేస్తాయి. ఇది నిరంతర శక్తిని అందిస్తుంది. అయితే శుద్ధి చేసిన పంచదార, వేగవంతమైన శోషణతో, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల డయాబెటీస్, లేదా చక్కెర సంబంధిత వ్యాధులు రావడానికి కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: అయోధ్య రామ మందిరం వెనుక పుల్లారెడ్డి స్వీట్స్ అధినేత కష్టం ఏమిటో తెలుసా..?