ఆహాలో రిలీజ్ అయిన ఈ కొత్త సినిమా చూశారా..? స్టోరీ ఏంటంటే..?

Ads

30 వెడ్స్ 21 సిరీస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు చైతన్య రావు. చైతన్య రావు ఆ తర్వాత నుండి చాలా సినిమాల్లో హీరోగా నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన హీరోగా నటించిన షరతులు వర్తిస్తాయి ఇటీవల ఆహాలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిరంజీవి (చైతన్య రావు) ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అతనికి తల్లితో పాటు, ఇద్దరు తోడ పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్లందరి బాధ్యత కూడా చిరంజీవి తీసుకుంటాడు. చిరంజీవి విజయశాంతి (భూమి శెట్టి) తో చాలా కాలం నుండి ప్రేమలో ఉంటాడు. చిరంజీవికి చిన్నప్పటి నుండి కూడా విజయశాంతి అండగా నిలుస్తుంది.

Ads

ఆర్థికంగా జరిగిన ఒక సమస్య వల్ల చిరంజీవి జీవితం తలకిందులు అవుతుంది. ఆ సమస్య ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ఆ తర్వాత చిరంజీవి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్యలు, వాళ్లు రోజు ఎదుర్కొనే సంఘటనలు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు రిలేట్ అయ్యే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది.

కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి. చాలా చోట్ల సినిమా చాలా డల్ గా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ బాగా తెర మీద కనిపించాలి అనే ఉద్దేశంతో మోతాదుకి మించి ఉన్నట్టు అనిపిస్తాయి. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఆ మెసేజ్ కూడా సరిగ్గా డెలివర్ చేయలేకపోయారు. పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, అసలు మిడిల్ క్లాస్ జీవితాన్ని సినిమాలో ఎలా చూపించారు అని తెలుసుకుందాం అనుకుంటే షరతులు వర్తిస్తాయి సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

Previous articleఈ కాలం యువత విడాకుల వైపు ఆసక్తి చూపడానికి కారణాలు ఇవేనా..? ఈ విషయం ఎందుకు ఆలోచించట్లేదు..?
Next article4 మహిళలు… 4 జీవితాలు… ఒకే కథ..! ఈ సినిమా చూశారా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.