Suma Kanakala : చ‌లాకీగా ఉండే సుమ‌.. ఆ ఒక్క విష‌యంలో రోజు బాధ‌ప‌డుతుంద‌ట‌..!

Ads

ఎప్పటి నుండో యాంకరింగ్ చేస్తూ సుమ అందరిని ఆకట్టుకుంటూనే ఉంది. చాలా మంది యాంకర్లు వస్తూ పోతున్నారు కానీ సుమ మాత్రం ఎన్నో ఏళ్ల నుండి యాంకర్ గా కొనసాగుతోంది. పైగా సుమ కి పాపులారిటీ కూడా ఎక్కువే. చాలా మంది కి సుమ అంటే ఎంతో ఇష్టం. బుల్లితెర రారాణి సుమ అని చెప్పొచ్చు. యాంకరింగ్ తో పాటుగా రియాలిటీ షో లను కూడా చేస్తూ ఉంటుంది సుమ. అలానే ఈవెంట్స్ లో సక్సెస్ మీట్స్ లో కూడా పాల్గొంటూ ఉంటుంది.

నిజంగా ఈమె ఎంతో బిజీ లైఫ్ ని గడుపుతూ ఉంటుంది. పైగా ఈ మధ్య సొంత యూట్యూబ్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేసింది. అందులో తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు పర్సనల్ విషయాలని షేర్ చేసుకుంటూ ఉంటుంది.

Ads

అలానే ఒక్కొక్కసారి ఆడియన్స్ అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం చెబుతూ ఉంటుంది. సుమ అత్తగారు మామగారు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సుమా అత్తగారు చనిపోవడం సుమని ఎంతో బాధ పెట్టిందట. సుమ అత్తగారు ఆమెను బాగా చూసుకునే వాళ్ళు. అత్తగారు అంటే తనకి చాలా ఇష్టం. అమ్మ తర్వాత అమ్మలా భావించిన తన అత్త గారు లేకపోవడం సుమ ని ఎంతో బాధ పెడుతుందిట. ఇప్పటికి కూడా సుమ బాధపడుతూనే ఉంటుంది.

సుమ పనిలో బిజీగా ఉంటే తన అత్తగారే పిల్లల్ని దగ్గర ఉండి చూసుకునే వారు. కానీ ఇప్పుడు ఆమె లేక పోవడంతో సుమ చాలా బాధ పడుతున్నారు. ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని ఆమె బాధ పడుతూ ఉందట ఈ విషయం సుమ తన ఫ్రెండ్ కి చెప్పారు. ఏది ఏమైనా మనుషులు ఉన్నంత వరకు వాళ్ళ విలువ తెలీదు. వాళ్ళు ఒక సారి మనకి దూరం అయితే వాళ్ల మీద ఎంత ప్రేమ ఉందనేది తెలుస్తుంది అలానే వాళ్ళ యొక్క విలువ కూడా తెలుస్తుంది.

Previous article‘వంటలక్క’ గా పాపులర్ అయిన ‘ప్రేమి విశ్వనాథ్’ ఇండస్ట్రీకి రాకముందు ఏం చేసేదో తెలుసా?
Next articleబల్లి పడితే బంగారం ఎందుకు పట్టుకోవాలి…?