బల్లి పడితే బంగారం ఎందుకు పట్టుకోవాలి…?

Ads

బల్లి పడగానే చాలా మంది పంచాంగాన్ని తిరగేస్తూ ఉంటారు. బల్లి పడితే ఏం జరుగుతుంది మంచి జరుగుతుంద లేదా అనేది చూసుకుంటారు. చాలా మంది నిజానికి ఎక్కువ భయపడుతూ ఉంటారు. అది ఎంత వరకు నిజం అనేది అస్సలు ఆలోచించరు. ఎవరో ఏదో అన్నారని పదే పదే దాని గురించి ఆలోచిస్తూ కంగారు పడిపోతూ ఉంటారు. బల్లులు విషయంలో కూడా ఇదే జరిగేది.

బల్లి మన శరీర భాగాల మీద పడితే ఏవేవో జరిగిపోతాయని అనుకుంటూ ఉంటారు పైగా బల్లి పడగానే కంగారు పడిపోతూ ఉంటారు. చాలా మంది బల్లి పడితే కంచి వెళ్ళిన వాళ్ళని ముట్టుకోవాలని వెంటనే వాళ్ళ ఇంట్లో కాని దగ్గర్లో వాళ్ళు కానీ కంచి వెళ్లినట్లయితే వాళ్లని ముట్టుకుని వస్తారు.

Ads

బల్లి మీద పడితే బంగారం పట్టుకోవాలని కూడా అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బల్లి అనేది విషపు ప్రాణి. మన ఒంటి మీద ఎక్కడ పడినా కూడా శుభ్రంగా కడుక్కోవాలి. ఇక శకునాల గురించి చూస్తే ఎడమవైపు బల్లి పడితే ఆడవాళ్ళకి మంచిది. మగవాళ్ళకి కుడివైపు పడితే శుభం కలుగుతుందని పంచాంగాలు చెబుతున్నాయి. అయితే వీటికి ఎలాంటి ప్రూఫ్స్ కూడా లేవు.

బల్లి శాస్త్రాలని బల్లి పడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయని ఎవరికి నచ్చినట్లు వాళ్ళు రాశారు. బల్లి కనుక తల మీద పడితే మరణం సంభవిస్తుందని కూడా రాశారు కానీ ఎలాంటి ప్రూఫ్ కూడా లేదు. అలానే తొడ మీద పడితే యోగం కలుగుతుందని కూడా రాశారు కానీ వీటికి కూడా ఎలాంటి ఆధారాలు లేవు. ఇవన్నీ మూఢనమ్మకాలే. కంచి వెళ్లి బంగారం బల్లి వెండి బల్లి ముట్టుకుంటే దోషం ఉండదని ప్రచారం ఉంది. అలానే బల్లి పడితే బంగారం పట్టుకోవాలనేది కూడా నిజం అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు.

Previous articleSuma Kanakala : చ‌లాకీగా ఉండే సుమ‌.. ఆ ఒక్క విష‌యంలో రోజు బాధ‌ప‌డుతుంద‌ట‌..!
Next articleఒకే గోత్రం వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవద్దు…?