Ads
గౌహతిలో మంగళవారం నాడు జరిగిన మూడో టీ20లో భారత్, ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ టీమిండియా పై విజయం సాధించింది. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లలో గెలిచిన భారత్ ఈ మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్ సాధించాలని భావించింది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత్, విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఆఖరి మూడు ఓవర్లలో విజయం ఆస్ట్రేలియా వైపుకు మారింది. మ్యాచ్ పూర్తి అయిన తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మూడో టీ20లో మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి, 222 పరుగులు చేసి, ఆసీస్ ముందు 223 పరుగుల టార్గెట్ ను ఉంచింది. భారత్ జట్టులో ఓపెనర్ రితురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసి, 123 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు.
ఆ తరువాత ఆసీస్ లక్ష్య ఛేదనకు దిగింది. అయితే ఆఖరి మూడు ఓవర్ల ముందు వరకు విజయం భారత్ చేతిలోకి వచ్చినట్టు కనిపించింది. అయితే చివరి 3 ఓవర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్, వేడ్ లు అద్భుతంగా ఆడడంతో, ఆస్ట్రేలియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ ఓటమి తరువాత టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, మాక్స్‌వెల్‌ను త్వరగా అవుట్ చేయాలనేది మా ప్లాన్. విపరీతమైన మంచు ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్ ను కాపాడుకోవాలంటే బౌలర్లు అసాధారణంగా ప్రదర్శన చేయాలి.
అయితే ఆసీస్ బ్యాటర్లు మొదటి నుండి బౌలర్ల పై ఒత్తిడిని పెంచారు. అయినప్పటికీ, త్వరగా మ్యాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలని, మ్యాచ్ చివరి వరకు పోరాడాలని ప్లేయర్స్ కి చెప్పాను. అయితే అతన్ని అవుట్ చేయలేకపోయామని, అందువల్లే మ్యాచ్ కోల్పోయామని వెల్లడించారు. ఎక్స్పీరియన్స్ ఉండడంతో 19వ ఓవర్ అక్షర్ పటేల్‌తో బౌలింగ్ చేయించాను. కానీ అనుకున్న ఫలితం రాలేదని వెల్లడించాడు.
Ads
Also Read: హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ వెనుక ముఖేష్ అంబానీ ఉన్నారా..?