Ads
హిందూ సంస్కృతి ప్రకారం ఎన్నో సాంప్రదాయాలు, ఆచారాలు తాత ముత్తాతల కాలం నుంచి అనాదిగా వస్తూ ఉన్నాయి. మన సనాతన ధర్మం ప్రకారం…మనం ఆచరిస్తున్నటువంటి కొన్ని ఆచార వ్యవహారాలు, నియమాలు.. నమ్ముతున్నటువంటి కొన్ని ధర్మాలు వెనుక తెలియని సైన్స్ దాగి ఉంది. చాలామంది వీటిని మూఢనమ్మకాలు అంటారు కానీ ..ఎంతో ముందు చూపుతో టెక్నాలజీ బేస్ తో అప్పట్లోనే మన పెద్దలు మన కోసం వీటిని రూపొందించారు అని తెలుసుకోలేకపోతున్నారు.
అలాంటి ఒక విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం…పొరపాటున ఎప్పుడైనా ఇంటి గడపపై కాలు పెట్టి నిలబడితే.. మన పెద్దలు వారిస్తారు. అలాగే నల్ల పిల్లి ఎదురైతే కీడు అంటారు…ఎవరన్నా తుమ్మితే బయటకు వెళ్ళకూడదు అంటారు…ఇవన్నీ మూఢనమ్మకాలు అని మనం కొట్టి పారేస్తాం. కానీ వీటి వెనక తెలియని మర్మం దాగి ఉంది అన్న సత్యం చాలా కొద్ది మందికే తెలుసు. ఇలా కొట్టిపారేసే విషయాలలో ఒకటి ప్రతిరోజు భార్యకు భర్త ఇంటికి వెళ్లేటప్పుడు పువ్వులు.. అందులోనూ ముఖ్యంగా మల్లె పువ్వులు తీసుకువెళ్లడం.
Ads
ఇంట్లో భార్యకి భర్త రోజు మల్లెపూలు తీసుకువస్తే…వీడు సినిమాలు చూసి నేర్చుకుంటున్నాడు…భార్యకు దాసోహం అయిపోయాడు…ఇలాంటి మాటలు వినాల్సి వస్తుంది. అందుకని చాలామంది మగవారు ఇదేదో కానీ పని అన్నట్టు భావిస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఇల్లు ఎప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లుతుంది అన్న విషయాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అనేది ఎప్పటినుంచో ఉన్న సామెత.
ఆడవారు ఉండే ఇంటి కల వేరుగా ఉంటుంది. అందులోనూ మరీ ముఖ్యంగా ఇంటిలో భార్య ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబం అంతా ఎంతో సంతోషంగా ఉంటుంది. ఎన్ని సమస్యలు ఉన్నా సరే భర్త తమను ప్రేమాభిమానాలతో చూసుకుంటాడు అన్న నమ్మకం కలిగితే ఆడవారు ధైర్యంగా ఉండగలుగుతారు. వాళ్లు ఆనందించడానికి బంగారం కొనియాల్సిన అవసరం లేదు…రోజు మూరెడు మల్లె పువ్వులు తీసుకువెళ్లిన చాలు.
పైగా ఆడవారు ప్రతిరోజు తెల్లని, సువాసన భరితమైనటువంటి మల్లె ,జాజి ,విరజాజి లాంటి పువ్వులను తలలో పెట్టుకోవడం వల్ల శుక్రుడు అనుగ్రహిస్తాడు. ఏ ఇంటి పై శుక్ర అనుగ్రహం ఉంటుందో ఆ ఇంటిలో ఉద్యోగం ,వ్యాపారం వృద్ధి చెందడంతో పాటు లక్ష్మీ కటాక్షం ఆ ఇంటిపై ఎప్పుడు ఉంటుంది.