Ads
దివంగత టాలీవుడ్ నటుడు తారకరత్నతో నటించిన ఒక హీరోయిన్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి భార్య అని చాలా మందికి తెలియదు. మరి తారకరత్నతో నటించిన ఆ హీరోయిన్ ఎవరు? ఆ సినిమా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా రాజకీయాలను, సినిమాలను వేరు చేసి చూడలేము. ఈ రెండు రంగాల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయం అందరికి తెలిసిందే. చరిత్రను చూసినట్లయితే సినీ రంగంలో రాణించిన ఎందరో యాక్టర్స్ రాజకీయాల్లోకి అడుగు పెట్టి, అక్కడ కూడా తమదైన ముద్రను వేశారు. అలాంటి వారిలో ఎన్టీఆర్, ఎంజీఆర్, జయలలితలు తొలి వరుసలో ఉంటారు. కాగా పొలిటికల్ లీడర్స్ సిని తారలను పెళ్లి చేసుకున్న సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. అయితే నందమూరి తారకరత్నతో నటించిన ఒక హీరోయిన్, ఇప్పటి మాజీ సీఎం సతీమణి గురించిన వార్తలు వినిపిస్తున్నాయి.
తారకరత్న గుండె పోటు వల్ల ఈమధ్యే కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచారు. ఆయన మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో లో విషాదచాయలు అలుముకున్నాయి. ఆయన గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర వార్త పరిశ్రమలో షికారు చేస్తోంది. ఆ వార్త ఏమిటంటే తారకరత్నకు జంటగా నటించిన ఒక హీరోయిన్ ఒక మాజీ ముఖ్యమంత్రి భార్య. ఆ హీరోయిన్ పేరు రాధిక. తారకరత్న హీరోగా నటించిన చిత్రం భద్రాద్రి రాముడు. ఈ సినిమాలో హీరోయిన్ రాధిక తనదైన నటనతో ఆడియెన్స్ ని మెప్పించింది. ఆమె కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం కుమారస్వామి సతీమణి. అయితే గతంలో హీరోయిన్ రాధిక, కుమారస్వామి మధ్య సంబంధం ఉందని చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇక ఆ వార్తలను నిజం చేస్తూ వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు.రాధికకు మెుదటి నుండి కూడా సినిమాలంటే చాలా ఆసక్తి. ఆమె నటిగా మాత్రమే కాకుండా కన్నడ ఇండస్ట్రీలో కొన్ని చిత్రాలకు ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించింది. అంతేకాకుండా రాధిక భవిష్యత్ లో పాలిటిక్స్ లో అడుగు పెట్టి, అక్కడ కూడా సత్తా చాటాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: పవన్ కళ్యాణ్, ప్రభాస్ తండ్రి, తారక రత్నకి ఉన్న పోలిక ఏమిటో తెలుసా?
Ads
View this post on Instagram