Ads
అవకాశాలు ఎక్కువగా ఏ ఇండస్ట్రీలో వస్తూ ఉంటాయో ఆ ఇండస్ట్రీకి వెళ్లి హీరో హీరోయిన్లు స్థిరపడుతూ ఉంటారు. తెలుగులో కూడా అవకాశాలు రాక చాలా మంది తెలుగు వాళ్ళు మరొక ఇండస్ట్రీలో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ సద్వినియోగం చేసుకుని ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తూ ఉంటారు నటులు. అయితే మన తెలుగు నటులు తెలుగులో అవకాశాలు రాక కొందరు..
అక్కడే ఎక్కువ అవకాశాలు వస్తూ నటిస్తున్న నటులు ఉన్నారు. తమిళ్, కన్నడ, హిందీ సినిమాలలో స్టార్ నటునటులుగా గుర్తింపు పొందారు మరి అటువంటి నటుల గురించి ఇప్పుడు చూద్దాం.
#1. సమీరా రెడ్డి:
సమీరా రెడ్డి రాజమండ్రి కి చెందిన ఆమె. ఈమె తెలుగులో కొన్ని సినిమాల్లో నటించింది.
#2. విశాల్:
విశాల్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు విశాల్ ప్రొడ్యూసర్ జీకే కృష్ణ కొడుకు, తమిళ్ లో మంచి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు విశాల్.
#3. ఆది పినిశెట్టి:
ఆది పినిశెట్టి దర్శకుడు రవి రాజా పినిశెట్టి కొడుకు. ఒక విచిత్రం సినిమాతో తన కెరీర్ మొదలు పెట్టాడు కానీ తనకి నటుడిగా బ్రేక్ ఇచ్చింది తమిళ్ సినిమా ఈవారం.
#4. ఆనంది:
బస్ స్టాప్, ఈ రోజుల్లో వంటి చిత్రాలలో ఈమె నటించింది. ఈమెకి ఇంకో పేరు హసిక. వీళ్ళది వరంగల్. తెలుగులో కొన్ని సినిమాలు మాత్రమే చేసింది తర్వాత అవకాశాలు రాలేదు కానీ తమిళ వైపు మాత్రం ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది.
Ads
#5. జానీ లీవర్:
బాలీవుడ్ లో ఒక మంచి స్టార్ కమెడియన్ గా జానీ లీవర్ పేరు తెచ్చుకున్నాడు. ఇతనిది ప్రకాశం జిల్లా.
#6. జీవా:
తమిళంలోని స్టార్ హీరోలలో జీవా కూడా ఒకడు జీవ ఎవరో కాదు స్టార్ ప్రొడ్యూసర్ ఆర్.బి చౌదరి కుమారుడు.
#7. శ్రీరామ్:
శ్రీరామ్ తెలుగు వాడే అయినప్పటికీ తెలుగులో కంటే కూడా తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు అక్కడ అవకాశాలు కూడా ఎక్కువగా వచ్చాయి.
#8. జయం రవి:
మోహన్ కొడుకు జయం రవి తెలుగువాడైనప్పటికీ కూడా తమిళ్ లోనే ఎక్కువగా నటిస్తూ కనబడతాడు.
#9. వైభవ్:
కోదండరామిరెడ్డి కొడుకు వైభవ్ తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అవకాశాలు ఎక్కువ రాలేదు. తమిళ్ లోనే మంచి హిట్ కోసం చూస్తున్నాడు.
#10. దియామీర్జా:
దియా మీర్జా హైదరాబాద్ అమ్మాయి ఈమెకి బాలీవుడ్ లో మంచి అవకాశాలు వచ్చాయి తెలుగులో ఆమెకి అవకాశాలు రాలేదు.