Ads
గత సంవత్సరం తెలుగు సినీ ప్రముఖులు చాలా మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే కొత్త ఏడాదిలో మొదట్లోనే సినీ పరిశ్రమలో మరి కొన్ని విషాదలు చోటు చేసుకోవడంతో సినీ పరిశ్రమ విషాద ఛాయలు అలుముకున్నాయి. దిగ్గజ దర్శకుడు విశ్వనాధ్, అలనాటి హీరోయిన్ జమున, యంగ్ హీరో నందమూరి తారక రత్న వంటి వారు కన్నుమూశారు. ఇక ఇప్పటి వరకు 2023లో మరణించిన సినీ సెలెబ్రెటీస్ ఎవరో చూద్దాం..
1.కళా తపస్వి విశ్వనాథ్:
దిగ్గజ దర్శకుడు కళాతపస్వి కె.విశ్వనాథ్ ఈ ఏడాది ఫిబ్రవరి 2న అనారోగ్య కారణాలతో కన్ను మూసారు.2.జమున:
సీనియర్ నటి జమున ఈ ఏడాది జనవరి 27న కన్నుమూశారు.3.నందమూరి తారక రత్న:
నందమూరి తారకతర్న జనవరి 27న లోకేశ్ పాదయాత్రలో గుండెపోటు కుప్పకూలిపోయాడు. 23 రోజుల పాటు చికిత్స తీసుకుంటూ హాస్పటల్ లోనే ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు.
Ads
4.వాణి జయరాం:
ప్రముఖ సింగర్ వాణీ జయరామ్ ఫిబ్రవరి 3న మరణించారు.
5.మయిల్ స్వామి:
ప్రముఖ కోలీవుడ్ కమెడియన్ మయిల్ సామి ఫిబ్రవరి 19న మరణించారు.6.దర్శకుడు సాగర్:
ప్రముఖ దర్శకుడు ఫిబ్రవరి 2న మరణించారు.7.సునీల్ బాబు:
సునీల్ బాబు తెలుగు, మలయాళం, తమిళం, హిందీ సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశారు. ఆయన జనవరి 6న గుండెపోటుతో కన్నుమూశారు. 8.డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి:
ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ శ్రీనివాస మూర్తి గుండెపోటుతో జనవరి 27న కన్నుమూశారు. ఆయన సూర్య, అజిత్, రాజశేఖర్, మోహన్ లాల్, విక్రమ్ లాంటి స్టార్ హీరోలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.
9.జూడో కేకే రత్నమ్:
పలు బాషలలో కొన్ని వందల సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా చేసిన జూడో కేకే రత్నం జనవరి 26న మరణించారు.
10. ఆరుద్ర సతీమణి కె.రామలక్ష్మి:
దివంగత రచయిత ఆరుద్ర భార్య, ప్రముఖ పాత్రికేయురాలు అయిన కె.రామలక్ష్మి (92) మార్చి 3న కన్నుమూశారు.
Also Read: మంచు మనోజ్ పెళ్లి ఆ స్టార్ హీరోయిన్ లాగే చేసుకున్నాడా?