The Greatest of All Time Review : “తలపతి విజయ్” డబల్ యాక్షన్ లో నటించిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

Ads

తమిళ్ హీరో విజయ్ హీరోగా నటించిన గోట్ సినిమా ఇవాళ విడుదల అయ్యింది. గోట్ అంటే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అని అర్థం. ఈ సినిమాలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

  • చిత్రం : ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
  • నటీనటులు : విజయ్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్ అమీర్, స్నేహ, లైలా, మీనాక్షి చౌదరి, జయరాం, మోహన్.
  • నిర్మాత : కల్పాతి ఎస్ అఘోరం, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్
  • దర్శకత్వం : వెంకట్ ప్రభు
  • సంగీతం : యువన్ శంకర్ రాజా
  • విడుదల తేదీ : సెప్టెంబర్ 5, 2024

goat review

స్టోరీ :

గాంధీ (విజయ్) ఒక స్క్వాడ్ ఏజెంట్. గాంధీ భార్య అను (స్నేహ). కొడుకు జీవన్ (విజయ్). అనుకి గాంధీ ఏ ఉద్యోగం చేస్తున్నాడు అనేది చెప్పడు. రహస్యంగానే ఉంచుతాడు. కుటుంబంతో కలిసి గాంధీ ఒక మిషన్ కోసం థాయిలాండ్ కి వెళ్తాడు. అక్కడ జరిగిన ఒక సంఘటనలో ఐదేళ్ల జీవన్ చనిపోయినట్టు గాంధీ అనుకుంటాడు. గాంధీ వల్లే ఇదంతా జరిగింది అని, అను కూడా గాంధీని దూరం పెడుతుంది. అయితే, 15 సంవత్సరాల తర్వాత జీవన్ బతికున్నట్టు గాంధీకి తెలుస్తుంది.

దాంతో గాంధీ జీవన్ ని కలిసి ఇంటికి తీసుకొస్తాడు. కుటుంబం అంతా కలిసింది అనే సమయంలో వారికి ఒక సంఘటన ఎదురవుతుంది. జీవన్ ని మీనన్ (మోహన్ అనే వ్యక్తి పెంచుతాడు). అసలు జీవన్, మీనన్ కి ఎలా దొరికాడు? జీవన్ ఎందుకు అలా మారిపోయాడు? గాంధీ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? జీవన్ కి దూరం అవ్వడం వల్ల తన ఉద్యోగానికి దూరం అయిన గాంధీ, మళ్లీ ఉద్యోగంలో చేరాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :

సినిమా కథ తెలిసిన కథ. ఇలాంటివి మనం చాలా సినిమాల్లో చూసాం. అయితే టేకింగ్ పరంగా కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. విజయ్ పాత సినిమాల రిఫరెన్స్ లు ఈ సినిమాలో చాలా వాడారు. అవి చాలా వరకు చూడడానికి కూడా బాగా అనిపిస్తాయి. సినిమా రిలీజ్ అయ్యే ముందు సినిమా కథ ఇదే అంటూ చాలా కథలు వినిపించాయి. కానీ అవన్నీ నిజం కాదు అని సినిమా చూశాక తెలుస్తుంది. సినిమా ముందుకు వెళుతున్న కొద్ది ఏం జరుగుతుంది అనేది అర్థం అవుతుంది. పెద్ద కొత్తగా అనిపించదు. కాకపోతే స్క్రీన్ ప్లే వల్ల ప్రేక్షకుడిని థియేటర్ లో కూర్చోబెట్టగలుగుతుంది. సినిమాకి రెండవ పార్ట్ కూడా ఉంటుంది అని ఒక చిన్న హింట్ కూడా ఇచ్చినట్టు అనిపిస్తుంది. అందులో మరి ఎలా చూపిస్తారు? ఏం చూపిస్తారు? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

Ads

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ సినిమాని విజయ్ తన భుజాల మీద నడిపించారు. ఇప్పటి వరకు విజయ్ తన పాత సినిమాల్లో చేయని ఎన్నో విషయాలని ఈ సినిమాలో చేశారు. అవన్నీ కూడా చాలా కొత్తగా అనిపించాయి. చాలా వరకు వర్క్ కూడా అయ్యాయి. మిగిలిన వాళ్ళందరికీ కూడా పర్ఫార్మెన్స్ కి అంత పెద్ద స్కోప్ లేదు. ఉన్నంతలో బాగానే చేశారు. హీరో పక్కన ఒక హీరోయిన్ కావాలి కాబట్టి మీనాక్షి చౌదరి ఉన్నట్టు ఉంటుంది. సినిమా మొత్తం భారీ తారాగణం ఉంటుంది. వాళ్లందరికీ కూడా మంచి పాత్రలు రాశారు. వాళ్లకి ఇచ్చినంత వరకు, ఆ పరిధి మేరకు వాళ్లు కూడా బాగా నటించారు.

టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే, యువన్ శంకర్ రాజా అందించిన పాటలు కానీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆకట్టుకోదు. డబ్బింగ్ క్వాలిటీ బాగుంది. తెలుగులో కూడా మంచి సింగర్స్ ని తీసుకున్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ ల విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు రాసిన డైలాగ్స్ కూడా బాగున్నాయి. కానీ ట్యూన్స్ మాత్రం కొత్తగా అనిపించవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల సీన్స్ కూడా పెద్దగా ఎలివేట్ అయినట్టు అనిపించవు.

యంగ్ విజయ్ కోసం వాడిన డి ఏజెంట్ టెక్నిక్ క్లోజప్ షాట్స్ కి, డైలాగ్స్ లేకుండా ఉండే షాట్స్ కి బాగుంది కానీ, యంగ్ విజయ్ మూమెంట్ ఉన్న షాట్స్ చూపించినప్పుడు గ్రాఫిక్స్ అని తెలిసిపోతుంది.  సీజీ వర్క్ ఎక్కడ వాడారు అనేది చూసే సగటు ప్రేక్షకుడు కనిపెట్టే విధంగా ఉంది. యాక్షన్ డిపార్ట్మెంట్ పనితనం బాగుంది. యాక్షన్ సీన్స్ డిజైన్ చేసిన విధానం చాలా గ్రిప్పింగ్ గా ఉంది. సిద్ధార్థ నూని అందించిన సినిమాటోగ్రఫీ కూడా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కొంత మంది గెస్ట్ అపియరెన్సెస్ కూడా ఉన్నారు. ఒక హీరోయిన్ కూడా ఒక పాటలో కనిపిస్తారు. సినిమా చివరిలో ఒక స్టార్ హీరో అతిథి పాత్ర కూడా ఉంది. వాళ్ళు ఎవరో తెర మీద చూస్తేనే బాగుంటుంది. కథ విషయంలో, కథనం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్ :

  • విజయ్
  • భారీ తారాగణం
  • యాక్షన్ సీన్స్
  • కొన్ని ట్విస్ట్ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • తెలిసిన కథ
  • మ్యూజిక్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్ :

ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, విజయ్ కోసం సినిమా చూద్దాం అనుకునే వారికి, వెంకట్ ప్రభు సినిమాల టేకింగ్ ఇష్టపడే వారికి, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా ఒక్కసారి చూడగలిగే డీసెంట్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

 

Previous articleSJ సూర్య, నయనతార కలిసి నటించారు అని తెలుసా..? ఈ సినిమా తెలుగులో కూడా వచ్చింది..!
Next articleబుల్లితెరపై సందడి చేయనున్న హీరో శివాజీ
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.