Ads
సినిమా కోసం నటులు చాలా చేయాల్సి వస్తుంది. ఎండ, వాన, చలి, గాలి ఇవన్నీ తేడా లేకుండా బయట షూటింగ్ ఉంటే అక్కడే నటించాల్సి వస్తుంది. కొన్ని సార్లు కంప్యూటర్ గ్రాఫిక్స్ వాడతారు. కానీ ప్రతి చోటా ఇలా గ్రాఫిక్స్ చేయాలి అంటే కష్టం. అందుకే రియల్ లొకేషన్స్ లో షూట్ చేస్తారు. ఇటీవల ఒక నటుడు తన సినిమా కోసం ఇలాగే కష్టపడ్డారు. కష్టం అంటే, ఎండలో, లేదా వానలో షూట్ చేయడం కాదు. డంప్ యార్డ్ లో షూట్ చేయడం. డంప్ యార్డ్ ఎలా ఉంటుంది అనేది అందరికీ తెలుసు.
అక్కడ కొంచెం సేపు నిలబడాలి అంటేనే కష్టంగా అనిపిస్తుంది. అది కూడా ముంబై లాంటి సిటీలో డంప్ యార్డ్ ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి ఒకచోట మన తెలుగు దర్శకుడు తీస్తున్న సినిమాలో ఒక తమిళ హీరో ఇలా 10 గంటలు ముంబైలోని డం యార్డ్ లో షూట్ చేశారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. ముంబైలో ఒక బిచ్చగాడు ఆ తర్వాత అక్కడ డాన్ గా ఎలా ఎదిగాడు అనేది ఈ సినిమా కథ.
Ads
ఇందులో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా లోని ఒక ఎమోషనల్ సీన్ తీయడానికి సినిమా వాళ్ళు డంప్ యార్డ్ లొకేషన్ గా ఎంచుకున్నారు. ఈ సీన్ షూటింగ్ దాదాపు 10 గంటల పాటు జరిగింది. అంతసేపు కూడా ధనుష్ సీన్ ఒరిజినల్ గా రావడానికి డంప్ యార్డ్ లో చెత్త మధ్యలో, వాసన మధ్యలో అలాగే కూర్చుని షూట్ చేశారు. మాస్క్ లాంటి జాగ్రత్తలు అందరూ పాటించినా కూడా ధనుష్ మాత్రం మాస్క్ కూడా వేసుకోకుండా షూటింగ్ చేశారు. అందుకే ధనుష్ డెడికేషన్ కి అందరూ అభినందనలు తెలుపుతున్నారు. అందుకే ధనుష్ ఇంత గొప్ప నటుడు అయ్యారు అంటూ అందరూ కామెంట్స్ చేస్తున్నారు.