Ads
దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైయస్సార్ ఉన్నంతకాలం జగన్ ఆంధ్ర రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటూ వచ్చారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత అనుకోని పరిస్థితుల వల్ల రాష్ట్ర రాజకీయాల్లో జగన్ పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాల కారణంగా అప్పటి రూలింగ్ పార్టీ అయినా కాంగ్రెస్ ను కాదనుకొని దూరమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి.. ఎట్టకేలకు స్వశక్తితో పార్టీని విజయం వైపు నడిపించాడు.
Ads
యువతకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నవరత్నా పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఎంతో మేలు చేయడానికి పాటుపడే ముఖ్యమంత్రిగా జగన్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. జగన్ పాలన వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలు ఎంతో అభివృద్ధి లోకి వచ్చాయి అని జనం భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నెలల వ్యవధి మాత్రమే ఉంది.. అయితే ఈసారి ఎవరు గెలుస్తారు అన్న విషయం ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది.
ప్రస్తుతం జగన్ ఎలా ఉంటాడో అందరికీ తెలుసు.. కానీ ఒకప్పుడు టీనేజ్ వయసులో.. నునుగు మీసాల ప్రాయంలో.. జగన్ ఎలా ఉంటాడో చాలా తక్కువ మందికి తెలుసు. పైన ఫోటోలో నిలబడిన ఆ కుర్రాళ్ళ పక్కన ఉన్న వ్యక్తి మరెవరో కాదు మన సీఎం జగనే. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పొరపాటున రాజకీయాల్లోకి వచ్చాడు కాస్త ట్రై చేస్తే యాక్టర్ అయిపోయే వాడే అంటూ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.