ఈ వ్యక్తి చాలా ఫేమస్… ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు..! ఎవరో తెలుసా..?

Ads

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త సినిమాలు జోరు బాగా పెరిగింది. కొత్త కొత్త హీరోలు ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుండో ఉన్న టెక్నీషియన్స్ కూడా హీరోలుగా మారుతున్నారు. తాజాగా ఒక డాన్స్ మాస్టర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీస్తూ సినిమా చేస్తున్నారు.

దానికి సంబంధించిన టైటిల్ లుక్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సంక్రాంతి కానుకగా విడుదల చేశారు. అందరి స్టార్ హీరోలు సినిమాలు కి కొరియోగ్రాఫర్ గా పనిచేసిన ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

this celebrity is making his debut as hero

ఇంతకీ ఎవరో కొరియోగ్రాఫర్ కం హీరో అనుకుంటున్నారా. ఆయనే జానీ మాస్టర్. జానీ మాస్టర్ హీరోగా మారదామని ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఒక సినిమా లాంచ్ మధ్యలోనే ఆగిపోయింది. అయితే ఇప్పుడు తాజాగా మరో చిత్రం ద్వారా ఆయన ఎంట్రీ జరుగుతుంది. ఆ చిత్రం పేరు రన్నర్. ఇందులో జానీ మాస్టర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి విజయ్ చౌదరి డైరెక్షన్ చేయగా, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో జానీ మాస్టర్ అచ్చం పవన్ కళ్యాణ్ ఏమి డేట్ చేసే విధంగా గాజు గ్లాసులో టీ తాగుతూ పడుకున్న ఫోస్ బాగా ఆకట్టుకుంటుంది. జానీ మాస్టర్ స్వతహాగా పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో పవర్ స్టార్ అభిమానులు కూడా జానీ మాస్టర్ సినిమాకి సపోర్ట్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ గా సూపర్ సక్సెస్ జానీ మాస్టర్ హీరోగా కూడా సక్సెస్ అందుకుంటారు లేదో వేచి చూడాలి.

Previous articleఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న హీరోయిన్ లైలా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?
Next articleస్ట్రీట్ ఫుడ్ వ్యాపారం చేసేవారికి జీహెచ్ ఎంసీ కొత్త రూల్స్.. ఏమిటంటే..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.