ఒకప్పుడు తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న హీరోయిన్ లైలా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా?

Ads

గతంలో స్టార్ హీరోయిన్ లుగా ఎన్నో ఏళ్లు కొనసాగిన ఎంతో మంది హీరోయిన్స్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొంత‌మంది కుటుంబంతో బిజీగా ఉంటే, ఇంకొంతమంది బిజినెస్, ఉద్యోగాలు చేసుకుంటూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో లైలా కూడా ఒక‌రు.

90వ దశకంలో ఆడియెన్స్ కి పరిచయం అవసరం లేని పేరు లైలా. ఈ బ్యూటీకి అప్పట్లో భారీగా  ఫాలోయింగ్ ఉండేది. 2004 వరకు ఆమె ఇండస్ట్రీలో తన హవాను కొనసాగించింది. లైలా క్యూట్ లుక్స్, తన అల్లరి పనులతో అందరిని ఆకట్టుకుంది. నవ్వుతున్నప్పుడు కళ్లు మూసుకోవడం ఆమె ప్రత్యేకత. తన క్యూట్ నెస్ తో లైల అప్పట్లో కుర్రాళ్ల మనసు దోచుకుంది.
ఇక హీరోయిన్ లైలా ‘దుష్మ‌న్ దునియాకా’ అనే హిందీ చిత్రంతో ఇండ‌స్ట్రీకి పరిచయం అయ్యింది. టాలీవుడ్ లోకి శ్రీకాంత్, జెడి చక్రవర్తి నటించిన ‘ఎగిరే పావురం’ చిత్రంతో లైలా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమె త‌న అందం మరియు అభిన‌యంతో తెలుగు ఆడియెన్స్ ని ఎంతగానో ఆక‌ట్టుకుంది. అల్ల‌రి పిల్ల‌గా క‌నిపిస్తూనే తన నటనతో మెప్పించింది.
ఆ మూవీ త‌ర‌వాత వరుసగా అవకాశాలు రావడంతో లైలా చాలా సినిమాల‌లో న‌టించి ఎంతో మంది అభిమానులను ఏర్పరుచుకుంది. ఇక ఆమె సినిమాలలో బిజీగా ఉన్న స‌మ‌యంలోనే వివాహం చేసుకుంది. లైలా వ్యాపార‌వేత్త మెహ్దీన్ ను ప్రేమించి, అతనితో 8 ఏళ్ల డేటింగ్ తరువాత అతడినే వివాహం చేసుకుంది. పెళ్లి తరువాత లైలా సినిమాలకి దూరం అయ్యింది. ఈ జంటకి ఇద్ద‌రు కుమారులు.
లైలా సెకండ్ ఇనింగ్స్ ని మొదలు పెట్టింది. గత ఏడాది కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ ‘స‌ర్దార్’ చిత్రంలో న‌టించి మళ్ళీ ఆడియెన్స్ ని అలరించింది. అప్పటి నుండి  లైలా సామాజిక మధ్యమాలలో కూడా యాక్టివ్ గా ఉంటోంది. ఒక‌ప్పుడు టాలీవుడ్ లో న‌టించిన ఈ బ్యూటీ మంచి స్టోరీస్ వ‌స్తే మళ్ళీ తెలుగులో కూడా న‌టిస్తాన‌ని తెలిపింది. ఆమె త్వరలోనే తెలుగు సినిమాలో నటించబోతుందని టాక్ వినిపిస్తోంది.
Also Read: ప్రేమికుడు మూవీ షూటింగ్ ను మధ్యలోనే ఆపాలని గవర్నర్ ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా?

Ads

 

View this post on Instagram

 

A post shared by Laila Official (@laila_laughs)

Previous article“ఇది జోక్ కాదు..!” అంటూ… పూనం పాండేపై ఇంటింటి గృహలక్ష్మి హీరోయిన్ కామెంట్స్..!
Next articleఈ వ్యక్తి చాలా ఫేమస్… ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు..! ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.