Ads
సినిమా ఇండస్ట్రీలో ప్రతి హీరో కూడా కెరియర్ స్టార్టింగ్ లో చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటారు. క్రమక్రమంగా సినిమాలో హిట్ అవుతూ ఉంటే స్టార్ స్టేటస్ పొంది వారు అడిగినంత ఇవ్వడానికి ప్రొడ్యూసర్లు సిద్ధంగా ఉంటారు.
తను మొదటి సినిమాకి నాలుగు లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న ఒక హీరో ఇప్పుడు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా పొందుతున్నాడు. ఇంతకీ ఎవరు ఆ హీరో అనుకుంటున్నారా….! ఆయనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ కుటుంబంలో ఎవరు అందుకోలేని గ్లోబల్ వైడ్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నారు. బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన 13ఏళ్ల వయసులో బాల రామాయణంలో బాల రాముడిగా అద్భుతంగా నటించి నంది అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమాల ప్రస్థానం చేసుకుంటే…2001లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో నిన్నుచూడాలని చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు.
Ads
కానీ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెం.1 తో ఎన్టీఆర్ పేరు మార్మోగిపోయింది. అనంతరం ఆదితో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక అంతే అప్పుడు నుంచి ఆయన స్టార్ హీరోగా మారిపోయారు.అనంతరం సింహాద్రి, రాఖీ, యమదొంగ, అదుర్స్, బృందావనం సహా రీసెంట్ ఆర్‌ఆర్‌ఆర్ వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. అయితే ఒకానొక సమయంలో వరుస ఫ్లాపులు ఎన్టీఆర్ ను చుట్టుముట్టాయి.
శక్తి, ఊసరవెల్లి, దమ్ము, బాద్షా, రామయ్యా వస్తావయ్యా, రభస వంటి డిజాస్టర్లుగా కూడా నిలిచాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ కి ఎంత రెమ్యూనిరేషన్ అయినా సరే ఇవ్వడానికి నిర్మాతలు వెనకాడడం లేదు.అయితే ప్రస్తుతం ఒక్కో సినిమా కోసం సుమారు రూ. 50 నుంచి రూ.60 కోట్ల వరకు రెమ్యునరేషన్ను తారక్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం దేవరకు రూ.60 కోట్ల వరకు ఛార్జ్ చేశారని తెలిసింది.
ALSO READ : చిరంజీవి హీరోయిన్ ఏంటి ఇప్పుడు ఇలా అయిపోయింది.. ఆమె వేల కోట్లకి అధిపతి అని మీకు తెలుసా..?