Ads
జనరేషన్స్ మారుతున్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు వస్తున్నారు. కొంత మంది స్థానాలని భర్తీ చేయడం కష్టం. కానీ వారు ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోయాక, వారికి ఒక మంచి స్టార్ హోదా వచ్చాక అంతకుముందు వారు ఉన్న పొజిషన్ లోకి మరొకరు వస్తారు.
మెగాస్టార్. ఈ మాట అనంగానే కళ్ళ ముందు మెదిలే వ్యక్తి చిరంజీవి. ఎన్నో సంవత్సరాల నుండి ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరి, మెగాస్టార్ అనే స్థాయికి న్యాయం చేస్తున్నారు. ఇప్పుడు చిరంజీవి ఇండస్ట్రీలోనే టాప్ హీరో అయిపోయారు. నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
కొంత మంది రామ్ చరణ్ అన్నారు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే మెగా పవర్ స్టార్ అయ్యారు. మరి కొంత మంది అల్లు అర్జున్ అన్నారు. అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ అయ్యారు. మెగాస్టార్ స్థానంలో వచ్చే వ్యక్తి మెగాస్టార్ అంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి అయ్యి ఉండాలి అనే వారు చాలా మంది ఉంటారు. ఆయనలానే సినిమాలని ఎంచుకుంటూ, అంతే గొప్పగా నటిస్తూ గుర్తింపు పొందిన హీరో మాత్రమే ఇలాంటి పదానికి న్యాయం చేయగలుగుతారు.
Ads
అయితే ఇప్పుడు నెక్స్ట్ మెగాస్టార్ ఎవరు అనే ప్రశ్నకి వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం ఒక హీరో పేరు మాత్రమే. ఆ హీరో నాని. నాని కూడా ఎటువంటి నేపథ్యం లేకుండా వచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆర్జేగా, ఇప్పుడు హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు. తనలాంటి ఎంతో మంది బ్యాక్ గ్రౌండ్ లేని వారిని ప్రోత్సహించడానికి నిర్మాతగా కూడా మారారు. ఇప్పుడు మెగాస్టార్ అనే పదానికి న్యాయం చేయగలిగే వ్యక్తి కేవలం నాని మాత్రమే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మధ్యలో సినీ నేపథ్యం లేకుండా వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు.
కానీ మెగాస్టార్ లాగానే ఒక స్ట్రీక్ మెయింటైన్ చేస్తూ కంటిన్యూ చేసిన హీరోలు మాత్రం తక్కువ మంది ఉన్నారు. వారిలో నాని ఒకరు. హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నారు. అది కూడా కేవలం కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. హాయ్ నాన్న లాంటి ఒక ఫీల్ గుడ్ సినిమా చేసిన నాని, దానికి ముందు దసరా లాంటి ఒక యాక్షన్ సినిమా చేశారు అంటే నమ్మడానికి కూడా కష్టంగా ఉంటుంది. ఒక పాత్ర కోసం అంతగా మారతారు. మెగాస్టార్ అవ్వడానికి ఇంతకంటే అర్హత ఎవరికి ఉంటుంది అని అంటున్నారు.
ALSO READ : “స్కంద” సినిమాలో… “లాజిక్” లేకుండా తీసిన 5 సీన్స్ ఇవే..!