నాలుగున్నర సంవత్సరాలలో రోడ్ల నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖర్చుపెట్టిన డబ్బులు ఎంతో తెలుసా..? రోజా ఏం చెప్పారంటే..?

Ads

సినిమాల్లో ఉన్న వాళ్లు కొన్నాళ్ళు సినిమాల్లో చేశాక, ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం అనేది తరచుగా జరుగుతూనే ఉంటుంది. వారిలో అలా సినిమాల్లో హీరోయిన్ గా, ఆ తర్వాత ముఖ్య పాత్రల్లో నటించి, తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చేసి ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లారు రోజా సెల్వమణి.

రోజా తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మధ్యలో గ్యాప్ తీసుకొని, గోలీమార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసి, జబర్దస్త్ ప్రోగ్రాంకి జడ్జ్ గా వ్యవహరించారు.

vangalapudi anitha about roja

ఎన్నో సంవత్సరాలు అక్కడ కొనసాగిన తర్వాత, నగరిలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రోజా, జబర్దస్త్ ప్రోగ్రాంకి జడ్జ్ గా స్వస్తి చెప్పారు. రాజకీయాల్లో తలమునకలై ఉండడం వలన, ఈ ప్రోగ్రాం లో పాల్గొనే తీరిక లేకపోవడం వలన, ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ప్రస్తుతం రోజా మినిస్టర్ ఆఫ్ టూరిజం, కల్చర్ అండ్ యూత్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పదవిలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో, రోజా కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడారు.

Ads

roja about andhra pradesh road construction amount

ఈ విషయం గురించి మాట్లాడుతూ రోడ్ల అభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. “చంద్రబాబు నాయుడు పదవిలో ఉన్నప్పుడు, అంటే 2014 నుండి 2019 వరకు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు” అని చెప్పారు. కానీ తర్వాత, “జగన్మోహన్ రెడ్డి పదవిలోకి వచ్చిన తర్వాత, గత సంవత్సరం నవంబర్ వరకు, అంటే నాలుగున్నర సంవత్సరాలలో రోడ్ల నిర్మాణం కోసం 42,236 కోట్లు” అని చెప్పారు. రెట్టింపు మొత్తాన్ని ఖర్చు పెట్టాము అని రోజా చెప్పారు. రోడ్ల గురించి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వాళ్ళని వచ్చి చూపించమని చెప్పారు. తాను నగరిలోనే ఉంటాను అని, అక్కడి నుండే చూపిస్తానని చెప్పారు. ఇంకా రాష్ట్ర అభివృద్ధికి చెందిన ఎన్నో విషయాలని రోజా ఈ ఇంటర్వ్యూలో చెప్పారు.

watch video :

ALSO READ : నాని సినిమాలో నటిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

Previous articleరామ్ చరణ్ కాదు… అల్లు అర్జున్ కాదు… చిరంజీవి తర్వాత మెగాస్టార్ అయ్యే హీరో ఇతనే..! కారణం ఏంటంటే..?
Next articleతాడేపల్లిగూడెం సభలో బాలకృష్ణ మాట్లాడే ముందు… పవన్ కళ్యాణ్ స్టేజ్ మీదకి ఎందుకు వచ్చారు..? కారణం ఇదేనా..?