ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎంత మారిపోయిందో..?

Ads

మనుషులు అన్న తర్వాత మారుతూ ఉంటారు. సినిమా నటులు అన్న తర్వాత ఇంకా మారుతూ ఉంటారు. అందుకు కారణం, సినిమాల్లోకి వెళ్లాక ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెడతారు. విటమిన్స్ కూడా ఎక్కువగా ఉండేలాగా వల్ల ఆహారం ఉంటుంది. అంతే కాకుండా, వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటారు. దాని వల్ల వారిలో మార్పు వస్తుంది. అంతే కాకుండా, కొంత మంది యోగా, మెడిటేషన్ వంటివి కూడా చేస్తూ ఉంటారు. దాని వల్ల మానసికంగా ఒత్తిడి తగ్గి ఇంకా ప్రశాంతంగా ఉంటారు.

this heroine changed alot

ఆ ప్రశాంతత వల్ల ఇంకా ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత ఒత్తిడిని బ్యాలెన్స్ చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయం కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు పైన ఉన్న హీరోయిన్ ఎన్నో సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు. సినిమాకి సినిమాకి తనని తాను మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా మారిపోయారు. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా సినిమాల్లో నటించారు. ఈ నటి స్వతహాగా తెలుగు నటి. గత కొంత కాలం నుండి తెలుగులో పాపులర్ అయిన నటి అదితి రావు హైదరి.

Ads

సమ్మోహనం సినిమాతో డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు. ఆ తర్వాత నాని హీరోగా నటించిన వి, సిద్ధార్థ్, శర్వానంద్ హీరోలుగా నటించిన మహాసముద్రం సినిమాలో నటించారు. పైన ఉన్న ఫోటో అదితి రావు హైదరి మొదటి సినిమా అయిన ప్రజాపతి సినిమాలోనిది. ఈ సినిమా మలయాళం సినిమా. మమ్ముట్టి ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాలో అదితి రావు హైదరి పూర్తిగా వేరుగా ఉంటారు. అదితి రావు హైదరి ఇప్పుడు చాలా మారిపోయారు.

ప్రస్తుతం సినిమాలతో, వెబ్ సిరీస్ తో బిజీగా ఉన్నారు. అదితి రావు హైదరి తెలుగువారు. రాజ వంశానికి చెందినవారు. వనపర్తిలో అదితి రావు హైదరి వారి సంస్థానం ఉంది. హైదరాబాద్ లో అదితి రావు హైదరికి ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. అయినా కూడా అవన్నీ వదిలేసి సినిమాల కోసం ముంబైకి వెళ్లి, ఎంతో కష్టపడి, తనను నిరూపించుకొని, ఇప్పుడు ఇంత గుర్తింపు సంపాదించుకున్నారు. మంచి యాక్ట్రెస్ గా పేరు పొంది స్టార్ హీరోయిన్ అయ్యారు.

Previous article“ధనుష్” తో పనిచేశాక విడిపోయిన 10 సెలెబ్రిటీలు వీరే..! ఎవరెవరు ఉన్నారంటే..?
Next articleఒకే ఒక్క డైలాగ్ తో ఫేమస్ అయిపోయారు..? ఈ యాక్టర్ ఎవరో తెలుసా..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.