“ధనుష్” తో పనిచేశాక విడిపోయిన 10 సెలెబ్రిటీలు వీరే..! ఎవరెవరు ఉన్నారంటే..?

Ads

సినిమా ఇండస్ట్రీ అన్నాక వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కూడా బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా పెళ్లి, విడాకుల విషయాలు ఒకటి. ఇవన్నీ కూడా చాలా మంది సెలబ్రిటీలు బయటికి ఎక్కువగా చెప్పుకోవడానికి ఇష్టపడరు. కానీ వాళ్లకు తెలియకుండానే ఆ విషయాలు బయటకు వచ్చేస్తాయి. కొన్ని కో ఇన్సిడెన్స్ పరంగా జరిగిన విషయాలు ఉంటాయి. అలా ఒక హీరోతో సినిమా చేసిన కారణంగా దాదాపు 10 మంది తమ రిలేషన్ షిప్ బ్రేక్ చేసుకున్నారు.

ఆ హీరో వల్ల ఏం జరగలేదు. కానీ కో ఇన్సిడెన్స్ పరంగా చూస్తే, ఆ హీరో తో సినిమా చేసిన తర్వాత వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం, విడిపోవడం, లేదా ప్రేమలో ఉన్న వాళ్ళు విడిపోవడం జరిగింది. ఆ హీరో ధనుష్. ధనుష్ ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు తీసుకున్నారు. ధనుష్ తో పని చేసిన కొంత మంది సెలబ్రిటీలు విడిపోయారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

celebrities separated after working with dhanush

#1 సోనియా అగర్వాల్

సోనియా అగర్వాల్ తెలుగులో కూడా సుపరిచితురాలు. ధనుష్ తో కలిసి సోనియా అగర్వాల్ కాదల్ కొండేన్ సినిమాలో నటించారు. అప్పటికే సోనియా అగర్వాల్ సెల్వ రాఘవన్ తో ప్రేమలో ఉన్నారు. సెల్వ రాఘవన్ ధనుష్ కి అన్న. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. విడిపోయారు.

#2 నయనతార

నయనతార, ధనుష్ కలిసి యారడీ నీ మోహిని సినిమాలో నటించారు. అప్పటికి నయనతార ప్రభుదేవాతో ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరూ మూడున్నర సంవత్సరాలు ప్రేమలో ఉన్నారు. 2008 లో ఈ సినిమా వచ్చింది. 2011 లో నయనతార, ప్రభుదేవా పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు. పెళ్లి వరకు వెళ్లిన వీరి ప్రేమ ముందుకు వెళ్లలేక విడిపోయారు.

#3 కార్తీక్

యారడి నీ మోహిని సినిమాలో హీరో స్నేహితుడిగా కార్తీక్ నటించారు. కార్తీక్ ఒక స్టాండ్ అప్ కమెడియన్. కార్తీక్, సింగర్ సుచిత్ర ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు.

#4 అనిరుధ్ రవిచందర్

Ads

ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాతో అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడుగా పరిచయమైన సంగతి తెలిసిందే. అప్పటికే అనిరుధ్ రవిచందర్ ఆండ్రియాతో రిలేషన్ షిప్ లో ఉన్నారు. తర్వాత వీళ్లిద్దరు విడిపోయారు.

#5 దివ్యదర్శని

తమిళ్ లో డిడి పేరుతో గుర్తింపు పొందిన దివ్యదర్శని, ధనుష్ హీరోగా నటించిన పవర్ పాండి అనే సినిమాలో నటించారు. తన స్నేహితుడు శ్రీకాంత్ రవిచంద్రన్ ని 2014  లో పెళ్లి చేసుకున్న దివ్యదర్శని, ఆ తర్వాత 2017 లో విడిపోయారు.

#6 త్రిష

త్రిషకి వరుణ్ మణియన్ అనే ఒక వ్యాపారవేత్తతో ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ తర్వాత త్రిష ధనుష్ హీరోగా నటించిన కోడి సినిమాలో నటించారు. తర్వాత త్రిష కొన్ని కారణాల వల్ల వరుణ్ మణియన్ తో విడిపోయారు.

#7 జీవి ప్రకాష్ కుమార్

ధనుష్ తో జీవి ప్రకాష్ కుమార్ చాలా సినిమాలకి ట్రావెల్ చేశారు. ఇటీవల తన భార్యతో జీవి ప్రకాష్ కుమార్ విడిపోతున్నట్టు ప్రకటించారు.

#8 సమంత

సమంత ధనుష్ తో కలిసి తంగమగన్ సినిమాలో నటించారు. తర్వాత నాగ చైతన్య ని పెళ్లి చేసుకున్నారు. రెండు సంవత్సరాల తర్వాత విడిపోయారు.

#9 అమలా పాల్

అమలా పాల్ ధనుష్ హీరోగా నటించిన రఘువరన్ బీటెక్ సినిమాలో నటించారు. విజయ్ అనే దర్శకుడితో అమలా పాల్ పెళ్లి జరిగింది. తర్వాత వీళ్ళిద్దరూ విడిపోయారు.

#10 హన్సిక

హన్సిక ధనుష్ తో కలిసి మాపిళ్ళై అనే సినిమాలో నటించారు. అప్పుడు హన్సిక హీరో శింబుతో ప్రేమలో పడ్డారు. మరొక పక్క వీళ్ళిద్దరూ కలిసి రెండు సినిమాలు చేస్తూ ఉన్నారు. అప్పుడే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. రెండు సంవత్సరాలు రిలేషన్ షిప్ లో ఉన్న తర్వాత హన్సిక శింబుతో విడిపోయారు.

#11 ఎమీ జాక్సన్

ధనుష్ హీరో గా నటించిన తంగమగన్ సినిమాలో ఎమీ జాక్సన్ నటించారు. హీరోయిన్ అమీ జాక్సన్ 2015 లో జార్జ్ అనే ఒక వ్యక్తిని ప్రేమించారు. ఆ తర్వాత 2019 లో వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగింది. తర్వాత వీళ్ళు విడిపోయారు.

ఇలా కో ఇన్సిడెన్స్ గా ధనుష్ తో పనిచేసిన ఈ సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు.

Previous article30 ఏళ్లు దాటినా కూడా అమ్మాయిలు పెళ్లి వద్దు అనడానికి కారణాలు ఏంటో తెలుసా..?
Next articleఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇప్పుడు ఎంత మారిపోయిందో..?
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.