63 ఏళ్ల వెంకటేష్ పక్కన హీరోయిన్ గా… 34 ఏళ్ల నటి..! ఇదెక్కడి వింత..?

Ads

హీరోయిన్ లేకుండా సినిమాలు రావడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. ప్రతి సినిమాలో ఏదో ఒక పాత్ర కోసం హీరోయిన్ ఉండాల్సిందే. అయితే, సీనియర్ హీరోల సినిమాల్లో హీరోయిన్ ఎంపిక అనేది కొన్ని సార్లు కామెంట్స్ కి దారి తీసే విషయం అవుతుంది. చాలా సినిమాల్లో హీరో, హీరోయిన్ కి మధ్య ఉన్న వయసు తేడా తెలిసిపోతుంది అంటూ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంత మంది కలిసి నటించబోతున్నారు అని తెలిసిన వెంటనే కామెంట్స్ వస్తాయి. ఇటీవల బాలకృష్ణ – శృతి హాసన్ కాంబినేషన్ మీద, చిరంజీవి – శృతి హాసన్ కాంబినేషన్ మీద కూడా కామెంట్స్ వచ్చాయి.

this heroine to act with venkatesh in anil ravipudi movie 1

ఇప్పుడు మరొక కాంబినేషన్ మీద కూడా అలాగే కామెంట్స్ వస్తున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో, వెంకటేష్ ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు. ఇప్పుడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరుగుతుంది అని మళ్లీ ప్రకటించారు. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోయే యాక్టర్ ఎవరు అనే విషయం బయటకు వచ్చింది. ఆమె ఐశ్వర్య రాజేష్. ఐశ్వర్య రాజేష్ స్వతహాగా తెలుగు వారు అయినా కూడా తమిళ్ లో స్టార్ హీరోయిన్ అయ్యారు. తెలుగులో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేస్తూ ఉంటారు.

Ads

రిపబ్లిక్, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాల్లో నటించారు. నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు అంటే గుర్తొచ్చే వారిలో ఐశ్వర్య రాజేష్ ముందు ఉంటారు. ఎలాంటి పాత్ర అయినా సరే పోషించగలుగుతారు. అనిల్ రావిపూడి సినిమా అంటే కామెడీ ఉంటుంది. ఐశ్వర్య రాజేష్ ని ఒక మంచి కామెడీ పాత్రలో చూస్తాం. కానీ వెంకటేష్ కి, ఐశ్వర్య రాజేష్ కి మధ్య వయసు తేడా ఉంది. ఐశ్వర్య రాజేష్ వయసు 34 సంవత్సరాలు. వెంకటేష్ వయసు 63 సంవత్సరాలు. ఈ సంవత్సరం డిసెంబర్ కి వెంకటేష్ వయసు 64 సంవత్సరాలు అవుతుంది.

వీళ్ళిద్దరికీ మధ్య దాదాపు 30 సంవత్సరాల తేడా ఉంది. దాంతో వీళ్లిద్దరి కాంబినేషన్ మీద కూడా కామెంట్స్ వస్తున్నాయి. అయితే, ఏదేమైనా కూడా ఇది వార్త మాత్రమే. ఈ విషయం మీద ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సినిమా బృందం పూజా కార్యక్రమంతో సినిమా మొదలు పెడుతున్నట్టు ప్రకటించారు.

Previous articleనాస్తికులు అయిన శ్రీశ్రీ కి ఉన్న ఒకే ఒక్క సెంటిమెంట్ ఏంటో తెలుసా..? కూతురిని ఏం అడిగేవారంటే..?
Next articleఈరోజుల్లో కూడా ఇలాంటి హోటల్ ఉందా..? విజయవాడలో వాళ్ళకి తెలిసే ఉంటది..!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.