68 ఏళ్ల చిరంజీవి పక్కన హీరోయిన్ గా… 31 ఏళ్ల హీరోయిన్..! కూతురి వయసు ఉంటుంది కదా..?

Ads

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలలో నటిస్తున్నప్పటికీ ఆ సినిమాలు మాత్రం ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాయి.

చాలావరకు సినిమాలు డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చిరంజీవి నటించిన సినిమాలలో వాళ్తేరు వీరయ్య సినిమా తప్ప మిగిలిన సినిమాలు అన్నీ కూడా ఫ్లాప్ గా నిలిచాయి. ఇది ఇలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తదుపరి సినిమా షూటింగ్ లో బాగా బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే భోళా శంకర్ సినిమాతో ఘోరమైన డిజాస్టర్ ను చవిచూసిన చిరంజీవి తదుపరి సినిమాతో ఎలా అయినా సూపర్ హిట్ సినిమాను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు. అందులో భాగంగానే తదుపరి సినిమాను వశిష్ట కాంబినేషన్ లో చేయబోతున్నారు మెగాస్టార్. అదొక సోషియో ఫాంటసీ ఫిల్మ్ అని తెలుస్తోంది. జగదేకవీరుడు అతిలోక సుందరి టైపులోనే ఉంటుందట. ఇందులో మూడు లోకాల కాన్సెప్ట్ ఉంటుందని, ఆ ముల్లోకాలను జయించే వీరుడి కథే అని సమాచారం.

this heroine to be paired opposite chiranjeevi

Ads

 

అందుకే ఈ సినిమాకు ముందుగా ముల్లోకాల వీరుడు అని పెట్టాలని అనుకున్నారట. చివరకు విశ్వంభర అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. పంచభూతాల కాన్సెప్ట్‌తో వశిష్ట ఈ మూవీని భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ఇందులో ఎక్కువ వీఎఫ్ఎక్స్ వర్క్ ఉంటుందని టాక్. ఇక చిరంజీవిని ఇది వరకు ఎన్నడూ చూడని ఒక శక్తిలా చూపించబోతోన్నాడు వశిష్ట. ఈ మూవీ మీద ఇప్పటికే అందరిలోనూ అంచనాలు భారీ స్థాయిలోనెలకొని ఉన్నాయి.

this heroine to be paired opposite chiranjeevi

బింబిసార దర్శకుడు వశిష్ట మీద మెగా ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ లుగా ఒకరు ఇద్దరు హీరోయిన్లను తీసుకోగా అందులో మృణాల్ ఠాకూర్ కూడా ఒకరు. ఇక వశిష్ట చిరంజీవి కాంబినేషన్లో ఒక మృణాల్ ఠాకూర్ చిరంజీవి సరసన నటించబోతోంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తండ్రి వయసు ఉన్న 63 ఏళ్ల చిరంజీవితో కూతురి వయసు ఉన్న ఆమె హీరోయిన్ గా నటించడం ఏంటి అంటూ మండిపడుతున్నారు.

ALSO READ : గూఢచారి 2 లో హీరోయిన్ ఈమెనే…చూడడానికి శోభిత ధూళిపాళ్లలానే ఉందిగా..! ఎవరంటే.?

Previous articleAYODHYA: అయోధ్యలో తెల్ల రాయితో చేసిన రాముడు విగ్రహం ఎక్కడ ఉంది. ..!
Next articleఅయోధ్య రామయ్య కేసు వాదించే సమయంలో ఈ లాయర్ ఏం చేసారో తెలుస్తే హ్యాట్సాఫ్ అంటారు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.