Ads
ఎన్నో అద్భుతమైన ఘట్టాలకు ఆనవాళ్లు భారతదేశ చరిత్ర. అయితే అన్ని సమయాల్లో అందరూ చేసిన పనులు చరిత్ర పుటాలలోకి ఎక్కవు…కొందరు సామాన్యులు చేసిన అసామాన్యమైన కార్యాలు ఎవరికి తెలియక మరుగున పడిపోతాయి. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టం గురించే తెలుసుకుందాం పదండి. అది 1965 వ సంవత్సరం…భారత్ మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధభేరి మోగుతుంది.
పాకిస్తాన్ తన సరిహద్దుకు దగ్గరలో గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి రాణఫ్ కచ్ లో ఉన్న సర్క్రీక్ ప్రాంతాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తోంది. మరొక పక్క ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరు తో కాశ్మీరులో పాక్ మారువేషంలో ఉన్న తన సైనికులు చేత తిరుగుబాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ పరిస్థితుల్లో యుద్ధం అనివార్యంగా మారింది.
అప్పట్లో భారత్ మరియు పాకిస్తాన్ మధ్య వారంలో రెండుసార్లు రాజస్థాన్ బార్మర్ జిల్లా నుంచి ఒక రైలు ప్రయాణిస్తూ ఉండేది.జైసల్మేర్ నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న మునాబావో రైల్వేస్టేషన్ కు వచ్చేది. ఈ స్టేషన్ దాటితే వచ్చే కాక్రపార్ అనే ఒక చిన్న గ్రామం నుంచి దాదాపు 300 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే హైదరాబాదు చేరుకోవచ్చు.
Ads
ఈ ట్రైన్ సర్వీస్ ని ఉపయోగించుకొని సింధ్ లో ఉన్నటువంటి ప్రజలు రాజస్థాన్ కు వచ్చేవారు. సింధ్ ప్రాంతంలో ఉన్న తార్పర్కర్ లో 80% పైగా హిందువులు ఉండేవారు. అయితే తీరా ఈ ట్రైన్ బయలుదేరి పాకిస్తాన్ లోకి వెళ్లిన సమయానికి.. భారత్ పై యుద్ధం ప్రకటించిన పాకిస్తాన్ సరిహద్దును కూడా మూసివేయాలనుకుంది. ఆ సమయానికి ట్రైన్ కాక్రపార్ రైల్వే స్టేషన్ లో ఉంది. అందులో ప్రయాణిస్తున్న వాళ్ళు చాలా వరకు భారతీయులే ఉన్నారు.. యుద్ధ పరిస్థితుల్లో వారు అక్కడ బందీలుగా ఉంటే.. భారత్ పై ఒత్తిడి తీసుకువచ్చే అవకాశం ఉంది.
అందుకే పాకిస్తానీ ప్రభుత్వం ట్రైన్ అక్కడే ఆపేయడానికి నిర్ణయించుకుంది. అయితే ఈ విషయం ముందుగా పసికట్టిన రైల్ లోకో పైలట్…సిగ్నల్ కోసం కూడా ఆగకుండా అత్యంత వేగంగా ట్రైన్ నడిపి సరిహద్దు ద్వారం మూసేలోపు ఇండియా చేరుకున్నాడు. ఈ రకంగా అతని సమయస్ఫూర్తి వందలాది మంది భారతీయ ప్రయాణికులను బందీలుగా కాకుండా కాపాడింది.