“ఆ నవ్వు కోసం చచ్చి పోయిన పర్లేదు సార్!!”…వీడియో కంటే కామెంట్స్ ఇంకా హైలైట్..!

Ads

“ఇక్కడికి వచ్చి వినవే…నీ పేరే వినిపిస్తుంది…ప్రవహిస్తున్న ప్రతి రక్తపు బిందువు మీద నీ పేరే ఉంటుంది…పీలుస్తున్న ప్రతి గాలి వేణువులోను నీ రూపమే ఉంటుంది….కదులుతున్న ప్రతి జీవకణంలోను నీ జ్ఞపకమే ఉంటుంది…” ఇదేంటి ప్రేమ లేఖ రాస్తున్నా అనుకుంటున్నారా.? కాదు అండి…సరిగా చూడండి…ఈ డైలాగ్ వింటే “ప్రేయసి రావే” సినిమా గుర్తొస్తుంది.

image credits: suresh productions

అప్పట్లో యూత్ ని బాగా ఎమోషనల్ గా కనెక్ట్ చేసిన సినిమా “ప్రేయసి రావే”. ఈ సినిమాలో రాశి, శ్రీకాంత్ నటన కి ఫిదా అవ్వాల్సిందే. అప్పట్లో రాశి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనవసరంలేదు. సంప్రదాయంగా కుందనపు బొమ్మలాగా ఉంటుంది రాశి. ఆమె స్మైల్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఏ ఉంది.

శ్రీకాంత్, రాశి జంటగా 9 సినిమాలు చేసారు…ప్రేయసి రావే, ఆమ్మో ఒకోటి తారీకు, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది, దీవించండి, గిల్లికజ్జాలు ఇవి సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్నాయి. వీళ్లిద్దరు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టేజి పై కనిపించారు.

తాజాగా ‘రుద్రంకోట’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీళ్ళ ఇద్దరికీ సంబందించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆ వీడియో చూస్తే ఆటోమేటిక్ గా మీ పేస్ లో స్మైల్ వచ్చేస్తుంది. స్టేజి పైకి ఎక్కిన తర్వాత శ్రీకాంత్ రాశీ ని చూసి సిగ్గుపడుతుంటే రాశీ అతనిని సరదాగా వీపు మీద కొడుతోంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఈ వీడియో కంటే ఈ వీడియో కి కామెంట్స్ ఇంకా హైలైట్. అవి ఒక లుక్ వేయండి.

Previous articleవందలాది మంది భారతీయులను పాకిస్తాన్ లో బందీలుగా మిగలకుండా కాపాడిన రియల్ హీరో…అసలేమైందంటే.?
Next articleఈ 5 మంది హీరోయిన్లు డాక్టర్లు అని మీకు తెలుసా.? లిస్ట్ లో వీళ్ళని అస్సలు ఊహించి ఉండరు.!
Hi, This is Harika. I have been working as a web content writer in PRATHIDVANI from the past one year and am experienced in writing articles in cinema, sports, inspiring stories and flash news categories.