మెదడు ఆరోగ్యంగా ఉండేదుకు.. కచ్చితంగా ఈ 7 తీసుకోండి..!

Ads

ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఈ మధ్యకాలంలో చాలా మంది వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్నారు. అందుకని ఖచ్చితంగా ఆరోగ్యం పై శ్రద్ధ పెట్టాలి. శారీరక ఆరోగ్యం తో పాటు మానసిక ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహార పదార్థాలని డైట్ లో చేర్చుకోవడం మంచిది.

ఈ పోషక పదార్థాలను కనుక మీరు రెగ్యులర్ గా తీసుకుంటే మీ మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..? ఎటువంటి పోషక పదార్థాలు మెదడు ఆరోగ్యానికి మంచిది అనేది చూద్దాం.

#1. ఐరన్:

ఐరన్ కచ్చితంగా అందాలి. మెదడు ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పక్కా ఐరన్ తీసుకోవాలి. ఇది బ్రెయిన్ ఫంక్షన్స్ కి హెల్ప్ అవుతుంది.

#2. ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్:

మీరు మీ డైట్ లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ని తీసుకోవడం మంచిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచేందుకు హెల్ప్ అవుతుంది.

Ads

#3. విటమిన్ బి12:

డైట్ లో మీరు విటమిన్ బి12 ని తీసుకుంటే మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి అవుతుంది. సో విటమిన్ బి12 కూడా డైట్ లో ఉండేలా చూసుకోండి.

#4. మెగ్నీషియం:

న్యూరాలజికల్ సమస్యలు లేకుండా చేస్తుంది ఇది. అలానే మైగ్రేన్, డిప్రెషన్ సమస్యలు కూడా వుండవు.

#5. జింక్:

జింక్ కూడా మీ డైట్ లో కచ్చితంగా ఉండాలి. నర్వ్ సిగ్నలింగ్ కోసం కూడా జింక్ ఉండాల్సిందే.

#6. క్యాల్షియం:

న్యూరో ట్రాన్స్మిటర్లని రిలీజ్ చేసేందుకు క్యాల్షియం కావాలి. సెలీనియం, విటమిన్ కె కూడా కావాలి. వీటిని తీసుకుంటే కూడా బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది.

#7. విటమిన్ ఈ:

ఇది జ్ఞాపక శక్తి ని పెంచుతుంది. మెదడు ని విటమిన్ ఈ ఆరోగ్యంగా మారుస్తుంది. ఇలా ఈ పోషకాలతో మెదడుని ఆరోగ్యంగా వుంచుకోవచ్చు.

Previous articleఈ 20 మంది నటీనటులపేర్లు ఏమిటో తెలుసా?
Next articleకాంగ్రెస్ హైకమాండ్ వద్ద మాజీ ఎంపీ పొంగులేటికి అనూహ్యంగా పెరిగిన ప్రాధాన్యత!