Ads
పెళ్లి అనేది రెండు అక్షరాల పదం అయినా అది జీవితానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఏదో ఒక సమయంలో పెళ్లి చేసుకోవాల్సిందే. పెళ్లి అంటే మన జీవితంలోకి మరొకరిని భాగస్వాములుగా తీసుకురావడం. అప్పటివరకు ఒకరిగా ఉన్న జీవితంలో ఇంకొకరు పాలుపంచుకోవడానికి వస్తారు. అలాంటి సమయంలో అబ్బాయిలు చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి. అలాంటివి చేస్తే కాపురం నూరేళ్లు పచ్చగా ఉంటుంది.లేకపోతే గొడవలు వచ్చి విడిపోయే స్టేజ్ వరకు వెళ్లిపోవచ్చు.
#1. పెళ్లి కాకముందు అబ్బాయి ఎంత ఖర్చుపెట్టినా పెళ్లి అయిన తర్వాత ఖర్చు తగ్గించాలి. ఆన్లైన్ లో ఏవైనా ఆర్డర్ పెట్టాలనుకుంటే భాగస్వాముల నిర్ణయం కూడా తీసుకోవాలి. పెళ్లయిన తర్వాత స్నేహితులతో మాత్రమే ఎక్కువ సమయం గడపకుండా ఇంటికి వచ్చి తన భార్యతో కూడా సమయం గడపాలి.
Ads
#2. ఉదయం నుంచి రాత్రి వరకు భార్య చేసిన పనులలో కాస్తో, గొప్పో సహాయం చేస్తే భార్యకు తోడుగా ఉంటుంది. పెళ్లి అయిన కొత్తలో భార్య ఒంటరిగా ఉండకుండా ఎప్పుడు తన వెంటే ఉండాలి. అందరితో కలిసినంత వరకు తోడుగా ఉండాలి.
#3. తను మొహమాటపడుతున్నా తన బాధ ఏంటో తెలుసుకొని ఆ బాధలో పాలుపంచుకొని ధైర్యంగా నిలవాలి. ఏమైనా గొడవలు అయితే అవి సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి తప్ప ఆ గొడవ మరింత పెరిగేలా ఉండకూడదు.
#4. ఎప్పుడు అర్థం చేసుకునేటట్టు ఉండాలి. ఆర్థికంగా, పర్సనల్గా ప్రతి విషయం తనతో షేర్ చేసుకోవాలి. ఏ విషయాలను దాయకూడదు అలాగే అబద్ధాలు చెప్పినా అవి ఏదో ఒక రోజు పెద్ద గొడవకు కారణం గా నిలుస్తాయి. అందుకే నిజాయితీగా ఉంటూ పనులలో పాలు పంచుకొనే మంచి భర్త ఉంటే ఎప్పటికీ ఆ కాపురం పచ్చగానే ఉంటుంది అని పెద్దలు నమ్ముతారు.
ఇలాంటివేవీ తెలియకుండా పెళ్లి చేసుకుని తర్వాత కోరుండి గొడవలు తెచ్చుకొని విడిపోయిన జంటలను ఎన్నో ఈ సమాజంలో చూస్తున్నాము. కనుక ఇవన్నీ తెలుసుకుని పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లి నిలబడుతుంది.