నిద్రలో “గురక” పెడుతున్నారా..? అయితే తప్పక వీటిని ఫాలో అవ్వండి..!

Ads

మనం ఆరోగ్యంగా ఉండేందుకు మంచి ఆహారం ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే ముఖ్యం. చక్కగా హాయిగా నిద్రపోతే మనకి చాలా బాగుంటుంది. మనం ఎంతో ఫ్రెష్ గా ఉండొచ్చు. ఉదయం నుంచి వివిధ పనులతో మనం అలసిపోతూ ఉంటాం. అదంతా కూడా మంచి నిద్ర వలన తొలగిపోతుంది. ఒత్తిడి అంతా తొలగిపోయి హాయిగా ఉంటే మెదడు కూడా బాగా పని చేస్తుంది.

కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు నిద్రపై కూడా కాస్త ధ్యాస పెట్టండి. మంచి నిద్రను పొందితే ఆరోగ్యంగా ఆనందంగా జీవించేందుకు అవుతుంది.

మానసికంగా శారీరకంగా కూడా నిద్ర మనకి ఎంతగానో సహాయం చేస్తుంది. అయితే నిద్రలో ఎక్కువ మందికి ఎదుర్కొనే సమస్య గురక. గురక వలన చాలా మంది సతమతమవుతూ ఉంటారు. గురక వలన ఎదుటివాళ్ళు ఎంతో ఇబ్బంది పడతారు. పక్కన నిద్రపోయి వారి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ని కచ్చితంగా చూడండి. అప్పుడు గురక సమస్య నుండి బయటపడడానికి అవుతుంది.

Ads

ఎందుకు గురక వస్తుందంటే..?

నిద్రపోయాక కూడ శ్వాస తీసుకుంటూ ఉంటాము. మెడ, తల భాగాల్లో మృదుకణజాలం లో వైబ్రేషన్స్ కారణంగా ఇలా జరుగుతుంది. ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో సెన్సిటివ్ కణజాలము ఉంటాయి. వాయుమార్గం నిద్రిస్తున్నప్పుడు రిలాక్స్ లో ఉంటుంది.
అప్పుడు చాలా బలవంతంగా గాలి లోపలికి వెళ్లడం జరుగుతుంది. దాంతో కంపనాలు వస్తాయి.

ఇలా చేస్తే గురక రాదు:

#1. డీహైడ్రేషన్ సమస్య రాకుండా నీళ్లు ఎక్కువ తాగితే ఈ సమస్య ఉండదు.
#2. అధిక బరువు వలన ఈ సమస్య వచ్చే ఛాన్స్ వుంది. సో బరువును కంట్రోల్ చేసుకోండి.
#3. నిద్రపోయే పొజిషన్ ని కూడ మార్చుకోండి. పక్కకు తిరిగి పడుకుంటే గురక సమస్య తగ్గుతుంది.
#4. ధూమపానం, మద్యపానం వలన కూడ రావచ్చు. సో చూసుకోండి.
#5. డైరీ ప్రొడక్ట్స్ ని కూడ అధికంగా తీసుకోవద్దు.

Previous article”మంగళవారం” నాడు తలస్నానం చేయకూడదా…? ఎందుకు వద్దంటారు..?
Next articleKismat Review: సైలెంట్ గా రిలీజ్ అయిన “కిస్మత్” సినిమా ఎలా ఉంది.? స్టోరీ, రివ్యూ & రేటింగ్!!