Ads
చాలా దేశాల వాళ్లు టాయిలెట్ పేపర్ ని ఉపయోగించరు. టాయిలెట్ పేపర్ కి బదులుగా ఇతర పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. అయితే ఎందుకు చాలా దేశాల వాళ్ళు టాయిలెట్ పేపర్ ని ఉపయోగించరు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. టాయిలెట్ పేపర్ల వల్ల ప్లస్ ఉందని చాలా మంది టాయిలెట్ పేపర్లని వాడుతూ ఉంటారు.
కానీ దాని వలన ఇతర సమస్యలు కలిగే అవకాశం ఉంది. టాయిలెట్ పేపర్ల వల్ల కలిగే ఇబ్బందులు తెలిస్తే మీరు కూడా టాయిలెట్ పేపర్ ని వాడడం మానేస్తారు.
#1. యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి:
టాయిలెట్ పేపర్ తో సరిగ్గా తుడుచుకోలేదంటే బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది దీని వలన యూరినరీ ఇన్ఫెక్షన్స్ కలుగుతాయి. మహిళలకి వెనక నుండి ముందుకి తుడవడం వలన బ్యాక్టీరియా యురెత్రా లో చేరే ప్రమాదం ఉంది ఇది ఎన్నో ఇబ్బందులని కలిగిస్తుంది.
#2. సరైన సదుపాయం లేకపోవడం:
Ads
ఆసియా దేశాలలో ఏమవుతుందంటే ప్లంబింగ్ ఫెసిలిటీస్ అంత బాగుండవు. వాటర్ మేనేజ్మెంట్ ప్రాసెస్ లో సమస్యలు ఉంటాయి. వెస్ట్ తో పోల్చుకుంటే ఇటువైపు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టాయిలెట్ పేపర్స్ ని ఫ్లెష్ చేయకూడదు.
#3. ఇరిటేషన్ వస్తుంది:
టాయిలెట్ పేపర్ మృదువుగా ఉండదు దీని వలన ఇరిటేషన్ వంటి ఇబ్బందులు వస్తాయి పైల్స్ మొదలైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి వాళ్ళు టాయిలెట్ పేపర్లకి బదులుగా నీటిని ఉపయోగించుటమే మంచిది.
#4. పర్యావరణానికి హాని కలుగుతుంది:
కేవలం యుఎస్ఏ లో చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం 36.5 బిలియన్ రోల్స్ ని ఉపయోగించారు అంటే 15 మిలియన్ల చెట్లని అందుకోసం వాడారు. నీళ్లు బ్లీచ్ మొదలైనవి కూడా కావాలి ఇవన్నీ కూడా పర్యావరణాన్ని హాని చేసినట్టే కదా..?
#5. శుభ్రంగా కూడా ఉండదు:
టాయిలెట్ పేపర్ కంటే కూడా నీటితో శుభ్రం చేసుకోవడమే మంచిది టాయిలెట్ పేపర్ ని ఉపయోగించడం వలన మలం పూర్తిగా తొలగిపోదు.