Ads
టాలీవుడ్ లో అప్పటి తరం సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఇప్పటి యువ హీరోల వరకు వారి స్టార్ డమ్,సినిమాలు, ఫ్యాన్స్, వారి కుటుంబం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే టాలీవుడ్ స్టార్స్ ఏం చదువుకున్నారు అనేదాని గురించి చాలా మందికి తెలియదు. హీరోలు చాలా వరకు ఉన్నత విద్య పూర్తి చేసి, సినిమాల్లోకి వచ్చారు. టాలీవుడ్ స్టార్స్ ఏం చదువుకున్నారో చూద్దాం..
- నందమూరి తారక రామారావు
ఎన్‌టి రామారావు సినీ పరిశ్రమలోకి రాకముందు గుంటూరులోని ఎసి కాలేజీలో డిగ్రీ చేశారు. - అక్కినేని నాగేశ్వరరావు
అక్కినేని నాగేశ్వరరావు SSC పూర్తిచేశారు.
- సూపర్ స్టార్ కృష్ణ
కృష్ణ సినిమాలలోకి రాకముందే ఏపీలోని ఏలూరులో CRR కాలేజీలో డిగ్రీ పూర్తి చేసారు.
మెగాస్టార్ చిరంజీవి
చిరంజీవి కామర్స్ లో పట్టా పొందారు. ఆ తర్వాత నటనలో ప్రావీణ్యం పొందడం కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు.
నందమూరి బాలకృష్ణ
బాలకృష్ణ నిజాం కాలేజీలో కామర్స్‌లో డిగ్రీని పొందారు.
- అక్కినేని నాగార్జున
నాగార్జున మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు..
- వెంకటేష్
వెంకటేష్ అమెరికాలో ది మాంటెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి ఎంబిఎ పూర్తి చేశారు.
- పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ రెండుసార్లు ఇంటర్మీడియట్లో ఫైల్ అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చాలాసార్లు బహిరంగంగా వెల్లడించారు.
- మహేష్ బాబు
మహేష్ బాబు కామర్స్ లో డిగ్రీని పూర్తి చేశారు.
Ads
- జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఇంటర్మీడియట్ పాసయ్యాడు.
- ప్రభాస్
ప్రభాస్ బి.టెక్ పూర్తిచేసిన తరువాత సినిమాల్లోకి వచ్చాడు.
- రానా దగ్గుబాటి
రానా బి.కామ్‌లో చేరి, ఆ తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్ లో ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టా పొందాడు.
- అల్లు అర్జున్
అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో డిగ్రీ చేసాడు.
- నాగ చైతన్య
హీరో నాగ చైతన్య బీకామ్ పూర్తి చేశాడు.
- రామ్ చరణ్
రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో డిగ్రీ చేసాడు.
- నితిన్
హీరో నితిన్ బీటెక్ చేసాడు.
- అఖిల్ అక్కినేని
అఖిల్ అమెరికాలో థియేటర్ ఆర్ట్స్‌లో డిగ్రీ పొందాడు.
- ఎస్.ఎస్.రాజమౌళి
ఎస్.ఎస్.రాజమౌళి తాను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యానని చాలా ఇంటర్వ్యూలలో చెప్పారు.
- నాని
నాని హైదరాబాద్ లోని వెస్లీ కాలేజీలో డిగ్రీ చేసాడు.
- అడివి శేష్
అడివి శేష్ శాన్ ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీలో చదువుకున్నాడు.Also Read: దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలు రిజెక్ట్ చేసిన నటీనటులు ఎవరో తెలుసా?