ఒక‌ప్పుడు క్రేజీ హీరో ‘వడ్డే నవీన్’ ఇప్పుడు ఏం చేస్తున్నాడో? ఎలా ఉన్నారో తెలుసా?

Ads

వడ్డే నవీన్, 90ల తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. అప్పట్లో బ్యాక్ తో బ్యాక్ ప్రేమకథా సినిమాలలో నటించి, లవర్ బాయ్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత కుటుంబ ప్రేక్షకులకు కూడా బాగా చేరువయ్యాడు. ప్రముఖ ప్రొడ్యూసర్ వడ్డే రమేష్​ వారసుడిగా వడ్డే నవీన్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

Ads

ఆయన నటించిన మొదటి చిత్రం ముప్పలనేని శివ దర్శకత్వంలో వచ్చిన ‘కోరుకున్న ప్రియుడు’ 1997లో విడుదల అయ్యింది. ఆ సినిమా విజయంతో లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్నాడు. దాంతోఆయనకి వరుసగా సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అలా ఆయన దాదాపుగా ముప్పై చిత్రాలల్లో హీరోగా నటించాడు. వడ్డే నవీన్ ఎన్టీరామారావు కుమారుడు రామకృష్ణ అల్లుడు అన్న విషయం అందరికి తెలిసిందే. నవీన్ రామకృష్ణ కుమార్తె చాముండేశ్వరిని ప్రేమించి,పెళ్లి చేసుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయారు.
ఆ తరువాత నవీన్ వేరే అమ్మాయిని వివాహం చేసుకుని,సినిమాలకు దూరంగా సంతోషంగా జీవిస్తున్నారు. వారికి ఒక కొడుకు ఉన్నాడు. ఇండస్ట్రీలో అందరు వడ్డే నవీన్ స్టార్ హీరోగా అవుతాడు అనుకున్నారు. కానీ నవీన్ సడెన్ గా కనుమరుగు అయ్యారు. ఆయన చివరిగా మంచు మనోజ్ హీరోగా రాంగోపాల్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన ‘ఎటాక్’ అనే సినిమాలో నటించాడు. కానీ ఆ చిత్రం హిట్ కాకపోవడంతో ఆయన మళ్ళీ సినిమాలలో కనిపించలేదు.
రెండేళ్ల క్రితం తన కొడుక్కి నిర్వహించిన పంచెకట్టు వేడుకకు టాలీవుడ్ సెలబ్రెటీలు హాజరయ్యారు. ఆ ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. వడ్డే నవీన్ ప్రస్తుతం తన కుటుంబానికి చెందిన బిజినెస్ లను చూసుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే తనకి సెట్ అయ్యే క్యారెక్టర్స్ వచ్చినపుడు తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు.కాగా వ్యక్తిగత సమస్యల కారణంగానే నవీన్ కెరీర్ లో ఇబ్బందులు వచ్చాయని సినీ పరిశ్రమకు చెందిన పలువురు అంటుంటారు.
అయితే వడ్డే నవీన్ ఇటీవల జరిగిన హీరో శర్వానంద్ ఎంగేజ్మెంట్ వేడుకకు హాజరు అయ్యారు. ఎంతో కాలం తర్వాత వడ్డే నవీన్ బయటికి రావడంతో ఆయన ఫాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఆ ఫోటోలు చూసిన నెటిజెన్లు ఇప్పటికీ ఆయనలో ఎలాంటి మార్పు రాలేదని, అప్పటిలాగే ఛార్మింగ్ గా ఉన్నారని కామెంట్స్ కురిపిస్తున్నారు. అయితే వడ్డే నవీన్ సడెన్ గా ఇండస్ట్రీకి ఎందుకు దూరంగా ఉంటున్నారనే విషయం తెలియరాలేదు.
Also Read: తెలుగు సినిమాలలో రీమిక్స్ చేసిన 20 సాంగ్స్..

Previous articleబాలయ్య ‘బాలగోపాలుడు’ చిత్రంలో నటించిన ఈ ఇద్దరు చిన్నారులు ఎవరో గుర్తుపట్టారా?
Next articleఅల్లు అర్జున్ పుష్ప సినిమాలో కేశవ క్యారెక్టర్ ని మిస్ చేసుకున్న బిగ్ బాస్ ఫేమ్ ఎవరో తెలుసా..?
Hai this is Kavitha. Cover the media industry. I write on the Movies, TV channels, OTT platforms and anything that is a medium for content distribution.